మోదీకి గుడి కట్టిస్తా అంటూ మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..!!
TeluguStop.com
దేశంలో ఈసారి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో మంచి పోటీ నెలకొంది.ఏడు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఆరు దశల ఎన్నికలు పూర్తయ్యాయి.జూన్ మొదటి తారీకు ఏడో దశ పోలింగ్ ముగియనుంది.
మూడోసారి కచ్చితంగా గెలవాలని బీజేపీ భావిస్తోంది.ఈ క్రమంలో ప్రధాని మోదీ ( Narendra Modi )ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఓ ఇంటర్వ్యూలో తనని తాను దేవుని ప్రతినిధిగా మోదీ అభివర్ణించుకున్నారు.దీంతో మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )బుధవారం స్పందించారు.
దేవుళ్ళు రాజకీయాలు చెయ్యరనే విషయం మోదీ తెలుసుకోవాలని సూచించారు. """/" /
దేవుళ్ళు రాజకీయాలు చేసి అల్లర్లకు ప్రేరేపించరు.
దేశ ప్రయోజనాల కోసం తనను భగవంతుడు పంపించాడని మోదీ వ్యాఖ్యలు.చూస్తుంటే ఆయన తనను తాను మరో దేవుడిగా భావించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
కానీ దేవుళ్ళు రాజకీయాలు చేయరని కౌంటర్ ఇచ్చారు.మోదీ దేవుడిగా భావించుకుంటే తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని మోదీ గారికి ఒక గుడి నిర్మించి ప్రసాదంగా గుజరాత్( Gujarat ) ప్రత్యేక వంటకం డోఖ్లా పెడతానన్నారు.
అంతేకాకుండా ఆ ఆలయంలో మోదీ కూర్చోవాలని.రోజు పూజలు చేస్తామని ఎద్దేవా చేశారు.
దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని మమతా బెనర్జీ హితవు పలికారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీలో టాప్ హీరో అతనే.. వాళ్లు సైతం అంగీకరించారుగా!