విపక్షాల ఇండియా కూటమికి మమతా బెనర్జీ షాక్..!!
TeluguStop.com
విపక్షాల ఇండియా కూటమికి( India Alliance ) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) షాక్ ఇచ్చారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు.
అయితే సీట్ల పంపకాలపై ఇండియా కూటమి విఫలం అయిందని మమతా బెనర్జీ తెలిపారు.
కూటమికి ఏ ప్రతిపాదన చేసినా తిరస్కరించిందన్న ఆమె ఒంటరిగా బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
"""/" /
అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) నిర్వహిస్తున్న యాత్రపై కనీసం సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని( BJP Govt ) గద్దె దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విపక్షాల ఇండియా కూటమికి ఇది ఎదురుదెబ్బ అని తెలుస్తోంది.
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తో విష్ణు కొత్త సినిమా.. ఆ ప్రాజెక్ట్ వివరాలు ఇవే!