ముందు ఆ పని చేయండి తర్వాత నా గురించి ఆలోచించండి.. అమిత్ షాకు మమతాబెనర్జీ సవాల్.. ?

బీజేపీకీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కి అసలు పడదన్న విషయం ఎన్నో సందర్భాల్లో రుజువు అయ్యింది.

అంతే కాకుండా బీజేపీ నాయకులు అవకాశం దొరికితే మమతాబెనర్జీ ని విమర్శిస్తారు.అందుకు ప్రతిగా మమత కూడా విమర్శలను సంధిస్తారు.

ఇకపోతే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి మమతాబెనర్జీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.

తాజాగా మమత, అమిత్ షాను ఉద్దేశించి, నన్ను విమర్శించే ముందు నా మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పోటీ చేయాలని, ఆ తర్వాత నా గురించి మాట్లాడాలని అమిత్ షాకు ఆమె సవాల్ విసిరారు.

అదీగాక బీజేపీ నేతలు రాత్రింబవళ్లు తన గురించి, తన మేనల్లుడి గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇకపోతే ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షాతో సహా ఇతర బీజేపీ నేతలు మమత పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

అదీగాక తన మేనల్లుడిని సీఎం చేసేందుకు యత్నిస్తున్నారని, ఇలా వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నారని దీదీ పై విమర్శలు వదిలారు.

ఈ నేపధ్యంలో మమత బీజేపీ నేతల మాటలకు గట్టిగానే సమాధానాలు ఇచ్చారు.

సబ్ వేలో మహిళ సజీవ దహనం.. న్యూయార్క్ గవర్నర్ రాజీనామాకు ఎలాన్ మస్క్ డిమాండ్