హరియాణాకు టీకా అందించేందుకు ముందుకొచ్చిన మాల్టా..!

దేశంలో అందరికి వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.అయితే రాష్ట్రాలకు వ్యాక్సిన్ అందించేందుకు ఇతర దేశాల నుండి సాయం అందుతుంది.

లేటెస్ట్ గా హరియాణాకు వ్యాక్సిన్ అందించేందుకు ఐరోపాకు చెందిన ఓ చిన్న ద్వీప దేశం మాల్టా ముందుకొచ్చింది.

హరియాణాకు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ వేయించేందుకు మాట్లా ఆసక్తు చూపిస్తుంది.రాష్ట్రానికి ఆరు కోట్ల డోసులను అందించేందుకు ముందుకొచ్చింది మాల్టా.

దేశంలో రాష్ట్రానికి నేరుగా టీకాలు అందించేందుకు విదేశీ సంస్థ ప్రోత్సహించడం ఇది మొదటిసారని తెలుస్తుంది.

మాల్టా రాజధానిలో ఉన్న ఫార్మా రెగ్యులేటరీ సర్వీసెస్ లిమిటెడ్ స్పుత్నిక్ వి అందించేందుకు ముందుకొచ్చింది.

ఒక్కో డోసుకి 1,120 రూ.లు అందచేస్తామని వెల్లడించింది.

వ్యాక్సిన్ కోసం హరియాణా ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది.ఈ క్రమంలో మాల్టాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

మాల్టా నుండి మొదటి విడతగా 30 రోజుల్లో ఐదు లక్షల డోసులు అందించేలా ఒప్పందం చేసుకున్నారు.

ప్రతి 20 రోజులకు 10 లక్షల డోసులు అందచేస్తామని మాల్టా సంస్థ చెప్పిందని హరియాణా ప్రభుత్వం వెల్లడించింది.

 ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.మొన్నటివరకు 45 ప్లస్ వయసు గల వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయగా ఇప్పుడు 18 ఏళ్ల పైన వయసు గల వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు.

ఆ స్టార్ హీరోకు భారీ షాకిచ్చిన త్రిష.. చిరంజీవి, కమల్ కోసం ఇంత చేసిందా?