16 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ హోంగార్డ్..!!
TeluguStop.com
సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.మనిషి కామం తో రగిలి పోతూ వావివరసలు లేకుండా శరీరం ఏది చెబితే అదే అన్నట్టు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉన్నట్లు అనేక సంఘటనలు బయటపడుతున్నాయి.
భార్యాభర్తల మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేక అక్రమ సంబంధాలు వంటి వాటివి మాత్రమే కాక వయసు పైబడిన వారు చిన్న పిల్లల పై అఘాయిత్యాలకి పాల్పడటం వంటివి చూస్తున్నాం.
సరిగ్గా ఇదే రీతిలో 40 సంవత్సరాల హోంగార్డు మల్లికార్జున్ అనే వ్యక్తి తన ఇంటి పక్కనే ఉన్న 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ సంఘటన ఇటీవల బయటపడింది.
మల్లికార్జున అనే హోంగార్డు మాయమాటలు చెప్పి 16 సంవత్సరాల కలిగిన ఇంటి పక్కనే ఉన్న బాలికను రెండు నెలల గర్భవతి చేయటంతో.
బాలిక తల్లిదండ్రులు వెంటనే విషయం తెలుసుకుని మల్లికార్జున్‌పై తుకారంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు హోంగార్డు మల్లికార్జున్(40)పై పోక్సో కేసు నమోదు చేశారు.
మల్లికార్జున్ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నట్లు… సొంత ఊరు అడ్డగుట్ట కి చెందిన వాడు అని వివరాలు బట్టి తెలుస్తోంది.
పార్లమెంట్‌లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిథ్యం ఉండాలి .. స్టాండింగ్ కమిటీ సిఫారసు