మళ్లీ పెళ్లి సినిమా కృష్ణ గారికి అంకితం.. నరేష్ కామెంట్స్ వైరల్!

నటుడు నరేష్ (Naresh) పవిత్ర లోకేష్(Pavitra Lokesh) టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ పెయిర్ గా నిలిచారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరిద్దరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ పలు సినిమాలలో సందడి చేసిన వీరు నిజ జీవితంలో కూడా ప్రేమలో పడటమే కాకుండా రిలేషన్ లో కూడా ఉంటున్న సంగతి తెలిసిందే.

మరి కొద్ది రోజులలో ఎంతో ఘనంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటూ నరేష్ వీరి రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక వీరిద్దరూ రిలేషన్ లో ఉండడమే కాకుండా ఇద్దరు కలిసి మళ్ళీ పెళ్లి(Malli Pelli) అనే సినిమాని చేశారు.

"""/" / ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాలను అందుకుంది.

నరేష్ వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది.ఇలా నరేష్ వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను మాట్లాడటమే కాకుండా పవిత్రతో తన రిలేషన్ కి మహేష్ బాబు(Mahesh Babu) కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు అంటూ ఈయన మహేష్ బాబు ప్రస్తావన కూడా తీసుకురావడంతో మహేష్ అభిమానుల సైతం కాస్త ఈ విషయంలో మండిపడుతున్నారు.

ఇక మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకోవడంతో నరేష్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

"""/" / ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా విజయనిర్మల (Vijaya Nirmala) కృష్ణ (Krishna)జంట గురించి ఈయన మాట్లాడుతూ వారిద్దరు రియల్ లైఫ్ లో బోల్డ్ కపుల్స్ అంటూ కామెంట్ చేశారు.

వారిని ఆదర్శంగా తీసుకుని మేము వారు స్థాపించిన విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ ను తిరిగి స్థాపించామని నరేష్ తెలిపారు.

ఇక పవిత్ర తాను కలిసిన నటించిన మళ్లీ పెళ్లి సినిమా కృష్ణ గారి 81వ జయంతి మే 31న జరగనుంది.

ఈ క్రమంలోనే తమ మళ్లీ పెళ్లి సినిమా కృష్ణ గారికి అంకితం చేస్తాము అంటూ నరేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వైరల్ : అయ్యబాబోయ్.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లాడిన మహిళ..