మరో కొత్త డాన్సర్ ను పరిచయం చేసిన మల్లెమాల.. కండక్టర్ ఝాన్సీకి గట్టి పోటీనే?
TeluguStop.com
బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
సోషల్ మీడియా వేదికగా టాలెంట్ ఉన్న వారిని గుర్తించడం మల్లెమాలవారు వారిని ఏకంగా వారి కార్యక్రమాలకు తీసుకువచ్చి వారికి సెలబ్రిటీ హోదాను కల్పిస్తున్నారు.
ఇప్పటికే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా గాజువాక డిపో బస్సు కండక్టర్ ఝాన్సీ పరిచయమైన విషయం మనకు తెలిసిందే.
ఈమె అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఈమెలో ఉన్న టాలెంట్ గుర్తించిన మల్లెమాలవారు తనకు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అవకాశం కల్పించారు.
ఇలా ఈ కార్యక్రమాల ద్వారా సెలబ్రెటీగా మారిపోయిన ఝాన్సీ ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.
ఝాన్సీకి పోటీగా మల్లెమాలవారు మరొక నేటిజన్ ను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
"""/"/
ఈ విధంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఈ ప్రోమోలో భాగంగా కొత్త డాన్సర్ నెల్లూరు కవిత ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఇకపోతే కవిత అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసినటువంటి వారు పెద్ద ఎత్తున సెట్లో సందడి చేశారు.
ఝాన్సీ కవిత పోటీపడి మరి డాన్స్ చేయడం ప్రేక్షకులకు ఎంతో కనువిందుగా ఉందని చెప్పాలి.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పూర్తి వినోదం చూడాలంటే ఆదివారం వరకు వేచి చూడాలి.
ఇది విన్నారా? అడల్ట్స్ కోసం డైపర్స్.. ఒక్కొక్కటి రూ.6,000 అట.. ఉపయోగం ఏంటంటే!