ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్న మల్కాజ్ గిరి ఎస్.ఓ.టి పోలీసులు

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారు 1.5 కోట్లు వసూలు చేసిన ముగ్గురు నిందితులను మల్కాజ్ గిరి ఎస్.

ఓ.టి పోలీసులు అరెస్టు చేశారు.

ఖమ్మం నివాసి అయిన కాకరపర్తి సురేంద్ర ఒక ప్రైవేట్ ఉద్యోగి, 2012 లో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని స్నేహితుల వద్ద 12 లక్షలు వసూలు చేసి మోసం చేసాడని మధిర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది, అప్పటి నుండి ఖమ్మం నుండి తప్పించుకున్న సురేంద్ర ఉప్పల్ లో నివాసం ఉంటున్నాడు.

పుట్టా సురేష్ రెడ్డి అని పేరు మార్చుకున్న సురేంద్ర ఒక ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ గా జీవనం సాగదీసాడు.

ఉప్పల్ లో నివాసం ఉండే సురేష్ తో పరిచయం ఏర్పాటు చేసుకుని రైల్వే, మెట్రో లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 15 మంది వద్ద సుమారు 1.

5 కోట్లు వసూలు చేసి పరారయ్యాడు.మోసబోయమని తెలుసుకున్న భాదితులు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భాగవత్ తెలిపారు.

వీరి వద్ద నుంచి నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్, 4 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినట్లు సిపి తెలిపారు.

భాదితులవద్దనుంచి వసూళ్లు చేసిన డబ్బుతో వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేసినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునే యువత అడ్డదారులు తొక్కి మోసపోకుండా కష్టపడి చదువుకోవాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు.

ఆ హావభావాలు చూపెట్టగల నటి ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు ?