మేల్ నర్స్‌ దారుణమైన ఘాతుకం.. లేడీ డాక్టర్స్ గదిలో స్మార్ట్ ఫోన్ అమర్చి.. ఛీ.. .

సమాజంలో రోజు రోజుకు మనుషులు విచక్షణ కోల్పోయి మృగాలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.విద్యావంతులు, ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారో అనే ఆలోచన లేకుండా క్షణికమైన సుఖం కోసం ఆరాటపడుతూ సమాజానికి చీడపురుగుల్లా మారుతున్నారు.

ఇలాగే ప్రజలకు సేవలందించే వృత్తిలో ఉన్న ఒక మేల్ నర్స్ చేయకూడని తప్పును చేసి దొరికి పోయాడు.

ఆ వివరాలు చూస్తే.బెంగళూరులోని సంజయ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ ఆసుపత్రిలో మారుతేష్ (31) అనే మేల్ నర్స్‌ కామ కోరికలతో బుద్ధి వక్రించగా ఆసుపత్రి‌లో పనిచేసే లేడీ డాక్టర్లు దుస్తులు మార్చుకునే గదిలో స్మార్ట్ ఫోన్ అమర్చాడట.

ఈ విషయం తెలియని లేడీ డాక్టర్లు ఆ రూం కు వెళ్లి దుస్తులు మార్చుకునేవారట.

వాళ్లు అక్కడి నుంచి వెళ్లగానే ఎవరి కంటపడకుండా తన ఫోన్‌ తీసుకుని ఆ వీడియోలను చూస్తూ వికృతానందం పొందేవాడట మారుతేష్.

ఇలా 2 నెలలుగా చేస్తున్న దారుణాన్ని ఓ లేడీ సర్జన్ కనిపెట్టి సహోద్యోగుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారట.

కాగా పోలీసులు వారి స్టెల్లో విచారించగా ఒక లేడీ డాక్టర్ల వీడియోలు మాత్రమే కాదు, కొందరు మహిళల వీడియోలు కూడా అతడు రికార్డ్ చేసినట్లు వెల్లడించాడట.

చూశారా మనమధ్యనే ఇలాంటి నీచపు మనుషులు ఉంటారు.అందుకే ఆడవారు అనుక్షణం అప్రమత్తంగా ఉండటం మంచింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా గురించి చందూ మొండేటి రియాక్షన్ ఇదే.. ఏమన్నారంటే?