డెలివరీ సమయంలో డాక్టర్ పాడు పని.. రూ.11 కోట్ల జరిమానా విధించిన కోర్టు!

మలేషియా దేశంలో( Malaysia ) ఓ గుండెను పిండేసే విషాదకర ఘటన చోటు చేసుకుంది.

ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది.దీంతో ఆగ్రహించిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

మృతురాలి కుటుంబానికి ఏకంగా రూ.11.

42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆ డాక్టర్లను చాలా సీరియస్ గా ఆదేశించింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే, పుణిత మోహన్( Punita Mohan ) అనే 36 ఏళ్ల మహిళ 2019 జనవరి 9న తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది.

కాన్పు జరిగిన తర్వాత ఆమెకు పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (ప్రసవానంతర రక్తస్రావం)( Postpartum Hemorrhage ) అయింది.

ఇది ప్రాణాంతకమని తెలిసినా, డాక్టర్లు రవి, షణ్ముగం నిర్లక్ష్యంగా వ్యవహరించారని కోర్టు తేల్చింది.

ఎంతో అనుభవం ఉన్న వీళ్లు పుణితను నర్సుల సంరక్షణలో వదిలేసి వెళ్లిపోయారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సకాలంలో సరైన చికిత్స అందించి ఉంటే పుణిత ప్రాణాలు కాపాడేవారని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

"""/" / కోర్టు రికార్డుల ప్రకారం, ఉదయం 10:30 గంటలకు డాక్టర్ రవి( Doctor Ravi ) పర్యవేక్షణలో పుణిత బిడ్డకు జన్మనిచ్చింది.

కాన్పు అయిన వెంటనే ఆమె నొప్పితో విలవిల్లాడింది.ఎందుకంటే ఆమెకు విపరీతంగా రక్తస్రావం అవడం మొదలైంది.

పుణిత తల్లి వెంటనే డెలివరీ రూమ్‌కు పరుగు తీసి చూడగా, తన కూతురు తీవ్రమైన బాధతో కనిపించింది.

మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని కుటుంబ సభ్యులకు డాక్టర్ రవి చెప్పాడు.

అంతా సర్దుకుంటుందని నమ్మబలికి, ఆయనేమో చల్లగా డ్రింక్ తెచ్చుకోవడానికి క్లినిక్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

క్లినిక్ యజమాని అయిన డాక్టర్ షణ్ముగం( Dr Shanmugam ) కూడా కొద్దిసేపటికే అక్కడి నుంచి జారుకున్నాడు.

"""/" / దారుణం ఏంటంటే, రెండు గంటలు గడిచినా ఆ ఇద్దరు డాక్టర్లు జాడలేరు.

నర్సులు మాత్రం కాటన్ ప్యాడ్లతో రక్తస్రావాన్ని ఆపేందుకు నానా తంటాలు పడుతున్నారు.చేసేదేమీ లేక పుణితను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది.

తన కళ్ల ముందే కూతురు చల్లబడిపోతూ, ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతుంటే చూసి తల్లడిల్లిపోయానని పుణిత తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన కూతురు పుణిత చనిపోయిందని హైకోర్టు నిర్ధారించింది.ఈ తీర్పుతోనైనా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వైద్యులకు గుణపాఠం వస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న నాగార్జున…