విచిత్రం: మనిషి పోలికలతో ఉన్న చేప,ఎక్కడంటే!

విచిత్రం: మనిషి పోలికలతో ఉన్న చేప,ఎక్కడంటే!

ఇంటర్నెట్ లో పోస్ట్ అయ్యే కొన్ని విషయాలు మనకు వింత అనుభూతిని కలిగిస్తాయి.

విచిత్రం: మనిషి పోలికలతో ఉన్న చేప,ఎక్కడంటే!

ఈ సోషల్ మీడియా లోనే అటు మంచి ఉంటుంది, అలానే చెడు కూడా ఉంటుంది.

విచిత్రం: మనిషి పోలికలతో ఉన్న చేప,ఎక్కడంటే!

మరికొన్ని విచిత్రంగా ఉంటాయి.అలాంటి విచిత్రమైన ఘటనే జాలర్ల కు చోటుచేసుకుంది.

వేటకు వెళ్లిన జాలర్ల కు విచిత్రంగా మనిషి పోలికలతో ఉన్న చేప దర్శనం ఇచ్చింది.

రోజులాగానే చేపల్ని పట్టుకోవడానికి వెళ్లిన జాలర్ల కు ఇలా మనిషి పోలికలతో ఉన్న ఒక విచిత్రమైన చేప కనిపించడం తో వారు ఆశ్చర్యపోయారు.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ అంటే మలేషియాలో చోటుచేసుకుంది.రోజుటి లాగే మలేషియా జాలర్లు చేపలు పట్టుకోవడానికి అని వెళ్లారు.

అయితే వారికి ఇలాంటి విచిత్రమై చేప కనిపించింది.దీనితో ఆ చేప కు మనిషి ముఖం లాంటి నోరు, దంతాలు అవి ఉండడం తో ఆశ్చర్యపోయిన వారు అన్ని చేపలతో పాటు దానిని అమ్మకుండా పక్కన పెట్టారు.

అనంతరం దానిని పరిశోధకులు వద్దకు తీసుకెళ్లగా అప్పుడు తెలిసింది అది ట్రిగ్గర్ ఫిష్ (Triggerfish) అని.

వాస్తవానికి ఈ చేపలకు మనిషి ముఖం లాంటి పోలికలే ఉంటాయట.ఇలాంటి రక రకాల జీవులు మన ప్రపంచం లో ఉంటాయని అయితే చాలా అరుదుగా వాటిని చూస్తూ ఉంటామని పరిశోధకులు తెలిపారు.

అంతేకాకుండా ఈ తరహా చేపలు ఆగ్నేయాసియా లో సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయట.

పెద్ద పెద్ద పెదవులు, బలమైన దవడలు వీటికి ఉంటాయి.దంతాలు అచ్చం మనుషులకు ఉన్నట్లే ఉంటాయి.

దీన్ని చూసిన వాళ్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే సోషల్ మీడియా లో ఈ ఫోటోలు పోస్ట్ చేయడం తో అవి కాస్త వైరల్ గా మారాయి.

దీనితో నెటిజన్లు ఈ చేపను చూసి ఆశ్చర్యపోతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్1, మంగళవారం 2025

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్1, మంగళవారం 2025