సుకుమార్ పై మలయాళీ ఫ్యాన్స్ సీరియస్.. అటు ఇటు అయితే పంచ్ తప్పదా!
TeluguStop.com
మలయాళ సూపర్ స్టార్ గా దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను దక్కించుకుని దూసుకు పోతున్న ఫాహద్ ఫాజల్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు సుకుమార్ పుష్ప సినిమా తో తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పుష్ప లో మెయిన్ విలన్ గా ఫాహద్ కనిపించబోతున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాలున్న పుష్ప సినిమా లో ఆయన నటించడం వల్ల ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ అనే అప్పీల్ దక్కుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మోస్ట్ వాంటెడ్ మూవీగా పుష్ప నిలవడానికి కారణంల్లో ఒకటి ఖచ్చితంగా ఫాహద్ ఫాజిల్ అనడంలో సందేహం లేదు.
అందుకే ఆయన లుక్ కోసం పుష్ప అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.
ఎట్టకేలకు ఫాహద్ ఫాజిల్ కు సంబంధించిన లుక్ ను రివీల్ చేయడం జరిగింది.
"""/"/
ఫాహద్ కు మలయాళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.వారు ఇప్పుడు తమ అభిమాన నటుడిని చూపించిన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
బాబోయ్ మరీ ఇలా చూపించావు ఏంటీ అంటూ సుకుమార్ ను ట్యాగ్ చేసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప లో ఫాహద్ కు గుండు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.ఫాహద్ ను కనీసం గుర్తించడానికి కూడా లేదు అని.
ఇలాంటి పాత్రలు ఆయన చేయడం తమకు నచ్చడం లేదు అంటూ అభిమానులు అసంతృప్తిగా కామెంట్స్ చేస్తున్నారు.
సుకుమార్ మరియు అల్లు అర్జున్ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా ఫాహద్ మరియు ఇతర నటీ నటుల కారణంగా 250 కోట్ల రూపాయలను వసూళ్లు చేయడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.
బావ కళ్ళల్లో ఆనందం కాదు.. భక్తుల కళ్ళల్లో ఆనందం చూడు: రోజా