‘RC15’ అప్డేట్.. చెర్రీకి విలన్ దొరికేసాడట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను ప్రెసెంట్ RC15 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.

ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ పూణే లో స్టార్ట్ చేసారు.

ఈ సినిమాలో కియారా అద్వానీ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా నుండి ఈ చిన్న అప్డేట్ వచ్చిన వైరల్ అవుతూనే ఉంది.

ఇక తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కు విలన్ దొరికేసాడంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో విలన్ కోసం శంకర్ మలయాళ స్టార్ నటుడిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

మలయాళ నటుడు సురేష్ గోపి ఈ సినిమాలో విలన్ గా కనిపించ బోతున్నాడట.

"""/"/ ఆయన పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో విలన్ గా చేసేందుకు ఒప్పుకున్నాడని సమాచారం.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా కూడా నెగిటివ్ రోల్ లోనే నటిస్తున్నట్టు టాక్.

ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి శంకర్ అన్ని ఇండస్ట్రీల నుండి నటులను ఎంపిక చేసుకుంటున్నాడు.

ఇక ఈ సినిమాకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

"""/"/ ప్రెసెంట్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను రాజమౌళి వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.

ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు.అందుకే చరణ్ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.

ఆ బాలీవుడ్ స్టార్ హీరో వల్లే ప్రభాస్ రాజసాబ్ లేటవుతుందా..?