తెలుగులో హిట్ కొట్టిన మలయాళ రీమేక్ మూవీస్ ఏంటో తెలుసా?
TeluguStop.com
డైరెక్ట్ సినిమాలు చేయడం కన్నా.ఇతర భాషల్లో విజయం సాధించిన సినిమాలను రీమేక్ చేస్తే ఈజీగా హిట్ కొట్టే అవకాశం ఉంటుంది.
అందుకే తెలుగులో టాప్ హీరోలు డైరెక్ట్ సినిమాలు చేయడం కన్నా రీమేక్ సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇతర భాషల హిట్ సినిమాల రైట్స్ తీసుకుని రీమేక్ చేసి మంచి విజయాలు సాధిస్తున్నారు.
గతంలో ఈ పరిస్థితి కాస్త తక్కువగా ఉన్నా ప్రస్తుతం రీమేక్ సినిమాల సందడి మరీ ఎక్కువైంది.
అలా మలయాళం హిట్ సినిమాలు ఎన్నో తెలుగులో రీమేకై మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఇంతకీ మలయాళం నుంచి తెలుగులో రీమేక్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మలయాళంలో ముమ్ముట్టి హీరోగా నటించిన సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేశాడు.ఈ సినిమాకు పసివాడి ప్రాణం అనే పేరు పెట్టాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఆ తర్వాత మలయాళంలో హిట్ సాధించి సినిమా దృశ్యం.
ఈ సినిమా చాలా భాషల్లో తెరకెక్కింది.తెలుగులో వెంకటేష్, మీనా నటించారు.
ఈ సినిమా టాలీవుడ్ లోనూ సూపర్ డూపర్ హిట్ సాధించింది. """/"/
మీర్ అనే మలయాళ మూవీని తరుణ్, రిచా జంటగా విజయ భాస్కర్ తెలుగులో రీమేక్ చేశాడు.
ఈ సినిమా మంచి విజయం సాధించింది.మలయాళ హిట్ మూవీ ఆధారంగా హనుమాన్ జంక్షన్ సినిమా చేశారు.
జగపతిబాబు, అర్జున్ నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. """/"/
అటు మలయాళ సినిమా ఆధారంగా చిరంజీవితో హిట్లర్ సినిమా తీశాడు ముత్యాల సుబ్బయ్య.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది.మలయాళంలో అక్ష దూతూ మూవీని తెలుగులో మాతృ దేవోభవ మూవీ తీశారు.
ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.మీసా మాధవ మలయాళ మూవీని అధర్మను తెలుగులో దొంగోడుగా తెరకెక్కించారు.
ఈ సినిమా మంచి విజయం సాధించింది.అటు తాజాగా విడుదల అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా కూడా మలయాళ మూవీకి రీమేక్ కావడం విశేషం.
కొబ్బరి పాలతో మీ కురులు అవుతాయి డబుల్.. ఎలా వాడాలంటే?