‘స్పార్క్’ చిత్రానికి సంగీతాన్ని అందించనున్న మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హెషమ్ వహాబ్
TeluguStop.com
విక్రాంత్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హై బడ్జెట్‌తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’.
ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మే నెలలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి కుంటోంది.
సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే.
చెప్పినట్లే హెషమ్ వహాబ్‌కు స్పార్క్ సినిమా సంగీత సారథ్య బాధ్యతలను అప్పగించారు.ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘హ్రిదయం’ సినిమాకు మ్యూజిక్‌ను అందించారు.
హ్రిదయం సినిమాలో ప్రతి పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
సూపర్ స్టార్ డమ్‌ను అందుకున్న హెషమ్ వహాబ్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ - సమంత జంటగా నటించిన ఖుషి సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇప్పుడు స్పార్క్ సినిమాకు కూడా హెషమ్ సంగీతాన్ని అందించడానికి ఓకే చెప్పారు.ఎఫ్ 3 వంటి సూపర్ సక్సెస్‌ఫుల్ చిత్రం తర్వాత మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రమిది.
హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకుంటోంది.త్వరలోనే యూరప్‌లోని అందమైన లొకేషన్స్‌లో తదుపరి షెడ్యూల్‌ను చిత్రీకరించబోతున్నారు.
ఒక్క తెలుగు వాళ్ళు తప్ప మిగతా సౌత్ డైరెక్టర్లు పాన్ ఇండియా లో ఎందుకు క్లిక్ అవ్వడం లేదు…