Heroine Karthika: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫొటోస్.. ఎవరో తెలుసా?

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి రాధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంటూ రాధ.

రాధ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కార్తిక.( Heroine Karthika ) మొదట జోష్ మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న కార్తీక ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మెప్పించింది.

సినిమాలలో నటించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

"""/" / తరచూ సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేయడంతో పాటు అప్పుడు పోస్ట్ లు కూడా చేస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె ఒక ఫొటో షేర్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఇందులో ఆమె ఒక వ్యక్తిని ఆలింగనం చేసుకుని, నవ్వులు చిందిస్తూ కనిపించారు.అలాగే, చేతికి ఒక ఖరీదైన రింగును( Ring ) ధరించారు.

దీనిని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన ఆమె.ఈగల్‌ ఐ ఎమోజీని జత చేశారు.

దీనిని చూసిన నెటిజన్లు ఆమెకు నిశ్చితార్థమైందని( Engagement ) భావిస్తున్నారు.కంగ్రాట్స్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

కార్తిక త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారంటూ స్థానిక పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. """/" / అయితే ఆమె నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

కానీ తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోతో అది నిజమే అని భావించిన అభిమానులు ఎంగేజ్మెంట్ అయిపోయిందని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు.

కాగా 2011లో విడుదలైన రంగం మూవీతో( Rangam Movie ) ఆమె విజయాన్ని అందుకున్నారు.

ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించారు.తెలుగులో దమ్ము, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి వంటి చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు.

2015 తర్వాత నుంచి కార్తిక వెండితెరకు దూరంగా ఉంటున్నారు.