Actress Kanakalatha: 300కు పైగా సినిమాలలో నటించిన నటి.. ఆఖరి రోజుల్లో మాత్రం పేరు కూడా మరిచిపోయి దీనస్థితిలో అలా?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వారు ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేక సినిమా ఇండస్ట్రీ కనుమరుగవ్వడంతో పాటు సంపాదించిన డబ్బులు అన్ని అయిపోయి ఆఖరి రోజుల్లో అనాధలుగా మరి రోడ్డుపై అడుక్కుతిన్న వారు చాలామంది ఉన్నారు.
అలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఆకలి రోజుల్లో దుర్భరమైన జీవితాన్ని గడిపి ఎవరూ లేని అనాధలుగా చనిపోయిన విషయం తెలిసిందే.
అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సెలబ్రెటీ కూడా ఒకరు.ఒకప్పుడు తన సినిమాలతో అభిమానులను అలరించిన నటి కనకలత.
( Actress Kanakalatha ) ఆమె సినిమాలతో పాటు సీరియల్స్‌లో తనదైన శైలిలో నటనతో మెప్పించింది.
"""/" /
మలయాళ చిత్రాలైన ప్రియం, అధ్యతే కన్మణి చిత్రాలతో ఆమెకు గుర్తింపు లభించింది.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా మలయాళం, తమిళంలో ఇండస్ట్రీలో కొనసాగారు.అయితే ప్రస్తుతం కనకలత పరిస్థితి అత్యంత దయనీయ స్థితిలో ఉంది.
ఆమెకు అల్జీమర్స్‌తో( Alzheimers ) పాటు పార్కిన్సన్స్( Parkinson ) వ్యాధి సోకింది.
తాజాగా కనకలత అనారోగ్యం గురించి ఆమె సోదరి విజయమ్మ( Vijayamma ) ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆగస్టు 2021లో ఆమె అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది.ప్రస్తుతం రోజుల తరబడి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
"""/" /
ప్రస్తుతం ఆమె ఆహారం తీసుకునే పరిస్థితిలోనే లేరని సోదరి తెలిపింది.
కేవలం లిక్విడ్ ఫుడ్‌తోనే( Liquid Food ) కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపింది.ఆమె తన రోజువారీ కాలకృత్యాలు సైతం మరచిపోతోందని డైపర్లు ఉపయోగించాల్సి వస్తోందని వివరించింది.
తన పేరు కూడా గుర్తు లేదని ఆమె సోదరి తెలిపింది.ప్రస్తుతం విజయమ్మ, ఆమె మేనల్లుడు కనకలత వద్దే ఉంటున్నారు.
కాగా 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న నటి 16 ఏళ్ల తర్వాత భర్త నుంచి విడిపోయింది.
అయితే ఆమెకు ఎలాంటి సంతానం కలగలేదు.ప్రస్తుతం ఆమెకు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ నుంచి నెలకు రూ.
5000 అందుతోంది.ఆమెకు సంస్థ బీమా కూడా ఉంది.
ఆమె అసోసియేషన్ ఆఫ్ టెలివిజన్ మీడియా ఆర్టిస్ట్స్ ఫిల్మ్ అకాడమీ ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుకుంటోంది.
కనకలత తన కెరీర్‌లో 360కి పైగా సినిమాల్లో నటించారు.
మా అమ్మకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!