రోడ్డు మీద హీరోయిన్ చనిపోతున్న సహాయం చేయని సంఘటన
TeluguStop.com
ఆమె వయసు 16.హీరో వినీత్ పక్కన హీరోయిన్ గా మొదటి అవకాశం.
సినిమా విడుదల అయ్యాక అద్భుత కావ్యం గా పేరు దక్కించుకుంది.లేత ప్రాయంలోనే విషాద ప్రేమ కథగా తెరకెక్కిన ఆ సినిమా అందరి చేత శభాష్ అనిపించుకుంది.
సినిమా విడుదలైన వెంటనే ఇందులో హీరోయిన్ గా నటించిన నటి కి జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా దక్కింది.
దేశము మొత్తం ఉలిక్కిపడింది ఒక్కసారిగా అందరి చూపు మలయాళ చిత్ర పరిశ్రమపై పడింది.
అలా తొలి సినిమా తోనే సంచలన సృష్టించిన నటి పేరు మోనిషా.ఆమె నటించిన ఆ సినిమా నఖక్షతంగల్.
ఏదో మొదటి సినిమా.ఉత్తమ నటి అయిపోతుందా.
అలా మొనిషకు అదృష్టం కొద్ది అవార్డ్ వచ్చేసింది అని అందరూ సరి పెట్టుకున్నారు.
కానీ వెనువెంటనే నఖక్షతంగల్ తమిళ రీమేక్లో సైతం నటించింది ఆ తర్వాత తెలుగులో లాయర్ భారతీయ దేవి అనే సినిమాలో నటించింది.
ఇక కన్నడ లో చిరంజీవి సుధాకర్, మలయాళం లో ఆర్యన్ చిత్రాల్లో నటించింది.
1980 నుంచి 92 వరకు కేవలం ఆరేళ్ల కెరియర్లో 18 మళయాల సినిమాలు, నాలుగు తమిళ సినిమాలు, ఒక తెలుగు, ఒక కన్నడ సినిమాలో నటించింది మౌనిష.
అలా తనలోని నటనని ప్రపంచానికి పరిచయం చేసిన మోనిషా అతి తక్కువ సమయంలో అందరిని విషాదంలో ముంచుతూ కన్ను మూసింది.
ఆమె కన్ను మూసే నాటికి కేవలం మౌనిష వయసు 22 ఏళ్లు మాత్రమే.
"""/" /
డిసెంబర్ 5న చెప్పాదివిద్య అనే ఒక సినిమా కోసం తల్లితో కలిసి కారులో షూటింగ్ కోసం బయలుదేరింది మౌనిష.
ఎదురుగా వస్తున్న మరొక వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే తీవ్ర గాయాల పాలై మౌనిష కన్న మూసింది.
ఆమె తల్లి శ్రీదేవి మాత్రం గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకుంది.
ఇది జరిగి ఇప్పటికీ 30 యేళ్లు.అయినా మలయాళంలో పూసిన మౌనిష వంటి ఒక పువ్వు ప్రపంచానికి తన పరిమళాన్ని పంచకుండానే కన్నుమూయడం నిజంగా బాధాకరం.
మోనిష చనిపోయిన విధానం కూడా ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది.చనిపోవడానికి కొద్దిసేపు ముందు వరకు ఆమె గాయాలతో రోడ్డు మీద పడిపోయి ఉండగా ఏ ఒక్కరూ కూడా ముందుకు వచ్చి మౌనిషా ని ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకోలేదు.
సహాయం చేయడానికి ముందుకు రాలేదు దాంతో ప్రమాదం జరిగిన అరగంట వరకు కొట్టుమిట్టాడి ఆ తర్వాత ప్రాణాలు వదిలింది మౌనిష.
వైరల్ ఫోటో: రక్తంతో పవన్ కళ్యాణ్ చిత్రం వేసిన అభిమాని