ప్రభాస్ ఫుడ్ పై మనసు పారేసుకున్న మరో బ్యూటీ.. అమ్మ తర్వాత అంటూ?
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas) ఇచ్చే ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన సినిమా షూటింగ్లో ఉంటే కనుక అక్కడున్న వారందరికీ ఎన్నో రకాల ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేయించి మరి తెప్పిస్తూ ఉంటారు.
అయితే ఇప్పటికే ప్రభాస్ పెట్టే ఫుడ్డు గురించి ఎంతోమంది సెలబ్రిటీలు పలు సందర్భాలలో వెల్లడించారు.
అయితే తాజాగా ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి మరో బ్యూటీ మనసు పారేసుకుంది.
ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. """/" /
ప్రభాస్ ప్రస్తుతం మారుతి( Maruthi ) డైరెక్షన్లో రాజా సాబ్ ( Rajasaab ) అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇందులో హీరోయిన్గా నటిస్తున్న వారిలో మాళవిక మోహనన్(Malavika Mohanan) ఒకరు.ఈమె ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్ ( Thangalaan ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో తెలుగులో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈమె ప్రభాస్ గురించి రాజా సాబ్ సినిమా గురించి మాట్లాడారు.
"""/" /
ఈ సందర్భంగా మాళవిక మాట్లాడుతూ రాజా సాబ్ సినిమాలో నాకు అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి ఇతర చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుందని వెల్లడించారు.ఇక మారుతి గారికి హీరోయిన్ల క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలో బాగా తెలుసని వెల్లడించారు.
ఇక ప్రభాస్ ఫుడ్(Food )గురించి మాట్లాడుతూ.ఆయన ఎంతో టేస్టీ ఫుడ్ అందరికీ తెప్పిస్తారని వెల్లడించారు.
అయితే ప్రభాస్ గారు తెప్పించిన ఫుడ్డు తినగానే నాకు అమ్మ చేతి వంట గుర్తుకు వచ్చింది అమ్మ చేసిన వంట తర్వాత అలాంటి టేస్ట్ ప్రభాస్ గారు పంపించిన ఫుడ్ ఉందని తెలిపారు.
ఇలా ప్రభాస్ గురించి మాళవిక మోహనన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్రికెట్ ఆడిన సీఎం.. వీడియో వైరల్