ఒకేసారి 19 సినిమాలు.. ఆ హీరోయిన్ కే సాధ్యమైందేమో?

పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేల చేస్తూ.కనుమరుగైన నటులను మళ్లీ తెర మీదికి తీసుకువస్తూ.

తన కాన్సెప్టుతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు కమెడియన్ ఆలీ.ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో ప్రేక్షకుల మదిలో ఎవరైతే మెదులుతూ ఉంటారో వారిని తీసుకువచ్చి గెస్ట్ సీట్లో కూర్చో పెడతాడు.

అంతేకాదు వారి కెరీర్ విశేషాలను అడుగుతూ ఎవరికి తెలియని విషయాలను కూడా అభిమానులు అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటాడు.

అందుకేనేమో ఆలీతో సరదాగా చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు బుల్లితెర ప్రేక్షకులు అందుకేనేమో ఈ షోకి టాప్ రేటింగ్ వస్తూ ఉంటుంది.

అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు షో కోసం ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.

అప్పుడెప్పుడో సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగి ఆ తర్వాత అవకాశాలు లేక కనుమరుగైపోయిన ఒక హీరోయిన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు కమెడియన్ ఆలీ.

ఆమె ఎవరో కాదు మాలాశ్రీ.ఇంతకీ ఈ మాలశ్రీ ఎవరు అనుకుంటున్నారు కదా.

అంతే లెండి ఆమె పేరు కూడా మర్చిపోయారు.కానీ ఈ ఫోటోలు చూస్తే మాత్రం మీకు ఆమె ఎవరో గుర్తు వచ్చి ఉంటుంది.

ఇటీవలే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చి కెరియర్ విశేషాలను పంచుకుంది.అయితే ఈ సందర్భంగా ఒకే ఏడాది 19 సినిమాలు చేసానని చెప్పి అవాక్కయ్యేలా చేసింది మాలాశ్రీ.

"""/"/ కన్నడలో కేవలం రాజకుమార్ కి మాత్రమే సాధ్యమైన రికార్డులు మాలాశ్రీ కూడా సాధించింది.

ఇక ఎప్పుడూ నవ్వుతూ ఎంతో సరదాగా కనిపిస్తూ ఉంటుంది.కానీ ఆమె జీవితంలోకి తొంగి చూస్తే మాత్రం ఊహించని విషాదాలు ఉన్నాయి.

కన్నడంలో ఆమె నటించిన చిత్రం సూపర్హిట్ అయింది అది ఆమెకు మొదటి హిట్ సినిమా.

కానీ అదే సమయంలో ఆమె తల్లి చనిపోయింది.ఇక కన్నడ నటుడు సునీల్ తో ప్రేమలో ఉన్న ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకుంది.

కానీ అంతలో ఆయన ఆక్సిడెంట్ లో దూరమయ్యాడు.ఆ తర్వాత రాము అనే నిర్మాతను పెళ్లి చేసుకుంది.

కానీ దురదృష్టవశాత్తు ఆయన కరోనా వైరస్ బారినపడి చనిపోయారు.ఇలా కన్నీళ్లు తెప్పించే విషాదకర ఘటన లు మాలశ్రీ జీవితంలో ఎన్నో ఉన్నాయి.

అనిమల్ మూవీ నటుడిని కొత్తగా చూపించబోతున్న అనిల్ రావిపూడి…