జబర్దస్త్ లేకపోతే వాళ్ల మొహాలకు సినిమాలు వచ్చేవా.. ఏనుగు వెళ్తే కుక్కలు మొరుగుతాయంటూ?
TeluguStop.com
ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన మలక్ పేట శైలజ( Malakpet Shailaja ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నటి కమెడియన్ ఆర్పీ ( Comedian RP ) గురించి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని ఆమె పేర్కొన్నారు.శ్రీదేవి డ్రామా కంపెనీలో( Sri Devi Drama Company ) పాల్గొంటే నాకు 17,500 ఇస్తారని శైలజ వెల్లడించారు.
నేను డబ్బుల కంటే మాటలకు ప్రాధాన్యత ఇస్తానని ఆమె చెప్పుకొచ్చారు.మనం మాట మీద ఉండటం ఒక ఎత్తు అని ఆమె పేర్కొన్నారు.
ఆది వల్లే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోకి వెళ్లానని మల్లెమాల సంస్థకు రుణపడి ఉంటానని శైలజ కామెంట్లు చేశారు.
నేనేంటో ఈటీవీ సంస్థకు తెలుసని శైలజ పేర్కొన్నారు.మల్లెమాల కీర్తి బంగారు కొండ అని శైలజ చెప్పుకొచ్చారు.
నేను నచ్చాను కాబట్టే మంచి ఆఫర్లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. """/" /
స్క్రిప్ట్ లేకుండానే శ్రీదేవి డ్రామా కంపెనీ షూట్ జరుగుతుందని శైలజ అన్నారు.
మల్లెమాల కంపెనీకి జోహార్లు అని శైలజ వెల్లడించారు.ఏనుగు తల కనిపించలేదని కుక్కలు అరుస్తాయని ఆమె పేర్కొన్నారు.
మల్లెమాల వాళ్లు అద్భుతమైన భోజనం పెడతారని శైలజ పేర్కొన్నారు.మూడు నాలుగు రకాల టిఫిన్లు పెడతారని మంచి భోజనం పెడతారని ఆమె అన్నారు.
అక్కడ మంచి ఫుడ్ పెడతారని ఆమె అన్నారు. """/" /
తిన్నింటి వాసాలు లెక్కపొట్టొద్దని ఆర్పీపై శైలజ పరోక్షంగా కామెంట్లు చేశారు.
జబర్దస్త్ లేకపోతే మీ మొహాలకు సినిమాలు వచ్చేవా అని మలక్ పేట శైలజ తెలిపారు.
మల్లెమాల సంస్థలో అన్నం బాలేదని అనేవాళ్లకు అన్నం పుట్టదని ఆమె వెల్లడించారు.కళ్యాణం కమనీయం డేట్స్ క్లాష్ కావడంతో ఈ మధ్య కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపించడం లేదని మలక్ పేట శైలజ కామెంట్లు చేశారు.
హీరో విశాల్ కి ఏమైంది… ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి కుష్బూ!