రోడ్డుపై చెత్త ఏరుతున్న మలైకా అరోరా.. నెటిజన్ల రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ( Malaika Arora )గురించి మనందరికీ తెలిసిందే.

ఈమె తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.స్టైలిష్ జిమ్ సెష‌న్స్ , కఠినమైన వ్యాయామ దినచర్యలతో నిరంత‌రం ప్ర‌జ‌ల‌ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే ఈమెకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే అందులో మ‌లైకా వ్యాయామశాలకు వెళుతున్నప్పుడు గేట్ వద్ద చెత్తను గమనించింది.వెంటనే దానిని ఎత్తి డస్ట్‌బిన్‌లో పారవేసింది.

"""/" / ఈ ఆకస్మిక ప‌రిణామాన్ని ఫోటోగ్రాఫ‌ర్లు కెమెరాల్లో బంధించారు.జిమ్‌లోకి అడుగుపెట్టిన ఆమె ఫోటో గ్రాఫర్‌లను ఆప్యాయంగా పలకరించింది.

ఫిట్‌నెస్‌తో పాటు పరిశుభ్రత పట్ల మలైకా నిబద్ధత ను చాలా మంది అభిమానులు ప్రశంసించడంతో వీడియో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో వైరల్ కావడంతో కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

ఆమె కావలనే కెమెరాల ముందు కావాల‌ని ఇలా చేశార‌ని ఆరోపించారు. """/" / మలైకా అరోరా సోషల్ మీడియా( Social Media )లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మలైకా తన వృత్తిపరమైన జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది.

మలైకా గత కొన్నాళ్లుగా నటుడు అర్జున్ కపూర్‌( Arjun Kapoor )తో డేటింగ్ చేస్తోంది.

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ నడుస్తోంది.