మాకో పదవి ప్లీజ్ ! రేవంత్ పై వీరి ఒత్తిడి
TeluguStop.com
అనుకున్నట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులంతా పదవులపై ఆశలు పెట్టుకున్నారు.
ఎన్నికలకు ముందు పార్టీ పెద్దలు అనేక హామీలు ఇచ్చారు.దీంతో ఇప్పుడు వారంతా ఆ పదవుల విషయమై ఒత్తిడి పెంచుతున్నారు.
ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ ల పోస్టులకు భారీగా డిమాండ్ ఏర్పడింది.ఈ పదవులు ఆశిస్తున్న కీలక నాయకులంతా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలుస్తూ, పదవుల కోసం ఒత్తిడి పెంచుతున్నారు.
మరికొందరు ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగిస్తున్నారు.పదవులు ఆసిస్తూ.
గాంధీభవన్ చుట్టూ తిరిగే నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటూ దరఖాస్తులు చేస్తున్నారు.
ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టేందుకు రేవంత్ రెడ్డి ( Revanth Reddy )కసరత్తు చేస్తూ దానిపైనే ఎక్కువ దృష్టి సారించారు.
"""/" /
కాంగ్రెస్( Congress ) లో టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి మంత్రివర్గ కూర్పు వరకు సామాజిక సమీకరణాల ఆధారంగా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
పనిలో పనిగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ , కార్పొరేషన్ చైర్మన్ ల ఎంపిక చేపట్టేందుకు రేవంత్ కసరత్తు మొదలుపెట్టినట్టుగా రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.
ఈ నామినేటెడ్ పోస్టుల కోసం సీనియర్ నాయకులతో పాటు, యువ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్ల విషయంలో బీసీలకు కొంత అన్యాయం జరిగిందని, పార్టీలోని కొంతమంది నాయకులు విమర్శలు చేశారు.
ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి ఆ లోటు తీరుస్తారనే ప్రచారం జరుగుతోంది.
"""/" / 54 కార్పొరేషన్లకు దాదాపుగా 200 మంది కీలక నేతలు పోటీ పడుతున్నారట.
ఎమ్మెల్యే టికెట్ల కోసం గతంలో గాంధీ భవన్ లో 1006 మంది దరఖాస్తు చేయగా, ఆ పేర్ల నుంచి ఎలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీలుగా వడబోత చేసి 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
టికెట్ దక్కని వారు అసంతృప్తికి గురవడంతో, ఇప్పుడు వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
How Modern Technology Shapes The IGaming Experience