లైగర్ కోసం రమ్యకృష్ణ రూ. కోటి రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్?

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కి ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా చిత్ర బృందానికి తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ తన మాస్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక ఈ సినిమా కోసం రమ్యకృష్ణ ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు వినిపించాయి.

ఇలా ఒక మదర్ పాత్రలో నటించడం కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.

అయితే రమ్యకృష్ణకు నిజంగానే కోటి రూపాయలు ఇచ్చారా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు.

"""/"/ ఈ క్రమంలోనే లైగర్ సినిమా కోసం రమ్యకృష్ణ తీసుకున్న కోటి రూపాయల రెమ్యూనరేషన్ విషయంపై పూరి కాంపౌండ్ నుంచి క్లారిటీ వచ్చింది.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ ఈ సినిమాని సరైన ప్లానింగ్ లేకుండా సినిమా షూటింగ్ చేయడం వల్ల రమ్యకృష్ణ డేట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది.

ఇలా ఆమె ఈ సినిమా కోసం ఎక్కువ కాల్ షీట్స్ ఇవ్వడం వల్ల తనకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి వచ్చిందని ఈ సందర్భంగా రమ్యకృష్ణ రెమ్యూనరేషన్ పై మేకర్ క్లారిటీ ఇచ్చారు.

ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాలి.

యంగ్ హీరోలను డామినేట్ చేస్తున్న సీనియర్ హీరోలు…