“RC 15” ఫస్ట్ లుక్ డీటెయిల్స్ టైమింగ్స్ ప్రకటించిన మేకర్స్..!!

రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) పుట్టినరోజు.

"RRR" తో గ్లోబల్ స్టార్ గా మారటంతో చరణ్ బర్త్ డే వేడుకలు( Ram Charan Birthday ) అభిమానులు మూడు రోజులు ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్ టాప్ మోస్ట్ దర్శకుడు శంకర్ ( Director Shankar ) దర్శకత్వంలో చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

"RC 15" వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.

ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత.చరణ్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమా.

ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం చరణ్ బర్తడే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ శంకర్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు దిల్ రాజు తెలియజేశారు.

అయితే రేపే బర్తడే నేపథ్యంలో ఉదయం 08:19 మధ్యాహ్నం 03:06 గంటలకు "RC 15" ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. """/" / ఎవరు చూపించని రీతిలో మూడు విభిన్నమైన పాత్రలలో రామ్ చరణ్ నీ శంకర్ ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఇక ఈ సినిమాలో ఎస్ జె సూర్య నెగటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

"RRR" తో వరల్డ్ వైడ్ చరణ్ కి మంచి మార్కెట్ క్రియేట్ కావడంతో "RC 15" చాలా తెలివిగా శంకర్ తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.