పి.డి.ఎస్.యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

యాదాద్రి భువనగిరి జిల్లా:ఈ నెల 11 న ఆలేరు టీఎన్జీవో భవన్ లో జరిగే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) యాదాద్రి భువనగిరి జిల్లా 22వ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పీవైఎల్ జిల్లా కార్యదర్శి బేజాడి కుమార్, పీ.

డీ.ఎస్.

యు జిల్లా నాయకులు రాచకొండ ఉదయ్ పిలుపునిచ్చారు.మంగళవారం ఆలేరు పట్టణంలోని ఎస్టీ హాస్టల్ లో మహాసభల విజయవంతంకై సన్నాహక కార్యక్రమం నిర్వహించి అనంతరం మహాసభల కరపత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కుమార్,ఉదయ్ మాట్లాడుతూ పి.డి.

ఎస్.యు ఏర్పడి 50 సంవత్సరాలుగా నిత్యం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ ప్రభుత్వ నిర్బందాలను తట్టుకొని ఎందరో విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు.

ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.

ఎస్.యు దేశ వ్యాప్తంగా వ్యాపించి ఎన్నో ఉద్యమాలు నిర్మిస్తుందని అన్నారు.

అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 8ఏళ్లుగా విద్య వ్యవస్థపై కపట ప్రేమనే చూపిస్తుందని,బడ్జెట్ లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని కొట్లాడుతుంటే కేవలం 6శాతం నిధులనే ఇచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగారుస్తుందని ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతుల్ని,సరిపడా ఉపాద్యాయుల్ని కల్పించకుండా విద్యార్థులు లేరనే సాకుతో ఎన్నో స్కూళ్లని మూసేస్తున్నారని,ఎమ్మెల్యే లేదా ఎంపి సీటు ఖాళీ ఐతే 2నెలల్లో ఎన్నికలు పెట్టి ఆ పదవిని భర్తీ చేస్తున్న ప్రభుత్వాలు,విద్యార్థుల భవిషత్ కి అవసరమైన పాఠశాలల్లో ఉపాద్యాయుల కొరత సంవత్సరాలుగా వున్నా వాటిపై దృష్టి పెట్టడం లేదని అన్నారు.

ఇంకో వైపు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ విద్య వ్యవస్థలోకి మతాన్ని తీసుకొచ్చి విద్యార్థుల మధ్య కూడా విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు.

విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడకుండా ఎంతసేపూ ఇతర మతాల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దానిద్వారా సమస్యలను,అభివృద్ధిని పక్క దారి పట్టిస్తుందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పోతూ రేపటి రోజు ప్రభుత్వ సంస్థలనేవే లేకుండా ప్రయత్నిస్తుందన్నారు.

కాబట్టి విద్యార్థులు దేశంలోని బీజేపీ ప్రభుత్వం,రాష్ట్రములోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక,ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేశాలని,దానికి పీ.

డీ.ఎస్.

యు మహాసభలో గత ఉద్యమాలను సమీక్షించుకుని భవిష్యత్ ఉద్యమాలను రచించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు సుంచు భాను, డి.

తిరుమల్,డి.వేలందర్,జి.

అక్షయ్,జి.శివమణి,అభిషేక్, రాకేష్,ప్రవీణ్,రాజు,జి.

చరణ్,సతీష్ లు పాల్గొన్నారు.