జన సేనాని కొండగట్టు యాత్రను జయప్రదం చేయండి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణరాష్ట్రంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభించనున్న యాత్రలో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని హుజూర్ నగర్
నియోజకవర్గ కార్యనిర్వాహకులు సరికొప్పుల నాగేశ్వరరావుపిలుపునిచ్చారు.
బుధవారం నేరేడుచర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సరికొత్త రాజకీయాలను పరిచయం చేయడానికి పవన్ కళ్యాణ్ఈ యాత్రను చేస్తున్నారని,యువతీ యువకులు, పవన్ అభిమానులు,పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని
అన్నారు.