బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి ప్రతినిధుల సమావేశం ( ప్లీనరీ ) ని విజయవంతం చేయండి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం స్థాయి ప్రతినిధుల సమావేశం ( ప్లీనరీ ) లో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి కోరారు.
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సిరిసిల్ల బైపాస్ రోడ్ ప్రక్కన గల ఆపేరల్ పార్క్ దగ్గర బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ తేదీ 25-04-2023 మంగళవారం ఉదయం 9-00 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5-00 గంటల వరకు కొనసాగుతుందనిఈ ప్లీనరీ లో పాల్గొననున్న 5000 మందికి భోజన వసతులు కల్పిస్తారని ఆయన తెలిపారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీసం రాజం, మండల ఉపాధ్యక్షులు కొలకాని శంకర్ , శ్రీనివాస్, సీనియర్ నాయకులు మేగి నరసయ్య , ఎలగందుల నర్సింలు , బందారపు బాల్ రెడ్డి , జవ్వాజీ రామస్వామి , లద్దునూరి తిరుపతి యాదవ్ , మహమ్మద్ అఫ్జల్ బాయ్, ధర్వేష్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?