మున్నూరు కాపు ల ఆత్మీయ సమ్మేళన సభ లను విజయవంతం చేయండి

రాజన్న సిరిసిల్ల( Rajanna Sirisilla ) జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21 వతేదీ మంగళవారం ఉదయం 11 -00 గంటలకు గంభీరావుపేట మండల కేంద్రం లో పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన ఆత్మీయ సమ్మేళన సభ లో పాల్గొని విజయవంతం చేయాలని మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు దుమాల శ్రీ కాంత్ ( Dumala Shri Kant )పిలుపునిచ్చారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేసి ఐక్యతను చాటుకోవాలని ఆయన కోరారు.

బుధవారం ముస్తాబాద్ మండల కేంద్రంలో , గురువారం వీర్నపల్లి మండల కేంద్రము లో, శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.

మున్నూరు కాపు సంఘాల అబివృద్ధి కొరకు పాటుపడుతున్నట్లు శ్రీ కాంత్ తెలిపారు.

ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట( Ellareddypet ) మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు నంది కిషన్( Nandi Kishan ), మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు వడ్నాల నర్సయ్య , వర్ష కృష్ణ హారి, బండారి బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,.

వైరల్: కోయ్ కోయ్ ‘పాస్టర్’ పాటలో అంత డెప్త్ వుందా?