జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం విజయవంతం చేయండి…డాక్టర్ బి శరణ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఇల్లంతకుంట మండలంలో గురువారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవము విజయవంతం చేయాలని డాక్టర్లు కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, పౌష్ఠికాహారలోపం, ఆకలి మందగించటం, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, బరువు తగ్గటం( Weight Loss ), మొదలగు లక్షణాలు కనిపిస్తాయని,వీటి నిర్మూలనకు 1 సంవత్సరం" నుండి 19 సంవత్సరం" పిల్లలకి ప్రతి అంగన్వాడీ కేంద్రం లో, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లో, కాలేజీ ల్లో అల్బెండజోల్ టాబ్లెట్ వేయబడునని అన్నారు.

1 స " నుండి 2స" పిల్లలకి సగం టాబ్లెట్, 2 స" నుండి 19స" పిల్లలకి పూర్తి టాబ్లెట్ చప్పరించి నమిలి మింగవలెనని తెలిపారు.

గురువారం వేసుకోలేనివారు, పిల్లలకి( Child ) తిరిగి 10 తేదీన మోప్ అప్ డే రోజు ఇవ్వబడునని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, పాత్రికేయ మిత్రులు, యువకులు, అన్ని సంఘాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మరోసారి పెళ్ళిచేసుకున్న శృంగార తార