పండ్ల తొక్కలతో మరింత అందంగా మెరిసిపోండిలా..!
TeluguStop.com
ఆరోగ్యమైన జీవితాన్ని గడపడానికి పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.రోజుకు రెండు రకాల ఫ్రూట్స్ ను తినడం వల్ల వివిధ రకాల జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
అయితే పండ్లే కాదు పండ్ల తొక్కల్లోనూ ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.ముఖ్యంగా పండ్ల తొక్కలను ఉపయోగించి మన చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.
మరింత అందంగా మెరిసిపోవచ్చు.కాంతివంతమైన మరియు మచ్చలేని చర్మాన్ని అందించడానికి ద్రాక్ష తొక్కలు సహాయపడతాయి.
అందుకోసం ద్రాక్ష తొక్కలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి.రెండు టేబుల్ స్పూన్లు ద్రాక్ష తొక్కల పొడికి వన్ టేబుల్ స్పూన్ బాదం నూనె (
Almond Oil )మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
వారానికి రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే ముఖంపై మచ్చలు పోతాయి.చర్మం కాంతివంతంగా మారుతుంది.
"""/" /
అలాగే ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పండ్లలో కివీ ( Kiwi )ఒకటి.
అయితే కివీ పండును తినే క్రమంలో తొక్కను తీసి డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.
కానీ కివీ తొక్కలో విటమిన్ ఈ మెండుగా ఉంటుంది.కివీ తొక్కలను మెత్తగా గ్రైండ్ చేసి పెరుగు కలిపి ముఖానికి పూతలా వేసుకుని పూర్తిగా అయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల స్కిన్ ఏజింగ్ ఆలస్యం అవుతుంది.చర్మం బిగుతుగా మారుతుంది.
ముడతలు ఏమైనా ఉంటే తగ్గుముఖం పడతాయి. """/" /
ఇక తెల్లటి మెరిసే చర్మాన్ని పొందాలి అని భావించేవారు బొప్పాయి పండు తొక్కలను మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసి అందులో చందనం పొడి( Sandalwood Powder ), పాలు కలిపి ముఖానికి పోసుకోవాలి.
20 నిమిషాల తర్వాత వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
చర్మం కాంతివంతంగా మరియు అందంగా మెరుస్తుంది.
అక్కడ ఉన్నది తరగతి గదా లేక స్పా సెంటరా? విద్యార్థులతో ఆ టీచర్ ఏకంగా