సేవ చేసే వ్యక్తిగా ముందుకు వస్తున్న చల్మెడ నే గెలిపించండి: జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ

రాజన్న సిరిసిల్ల జిల్లా: మాయమాటలు చెపుతూ ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, వాళ్ళను నమ్మి ఓట్లేస్తే గోసపడటం గ్యారెంటీ అని వేములవాడ నియోజకవర్గ బి.

ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు.

గురువారం బి.ఆర్.

ఎస్ పార్టీ వేములవాడ రూరల్ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనం పార్టీ మండల అధ్యక్షుడు గోస్కుల రవి అధ్యక్షతన చెక్కపల్లి గ్రామంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, బి.

ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ నరసింహా రావులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ అరుణ మాట్లాడుతూ పని చేసే వ్యక్తిగా, సీఎం కేసీఆర్ ఆదేశాలతో ముందుకు వస్తున్న చల్మెడ లక్ష్మీ నరసింహా రావును భారీ మెజారిటీతో గెలిపించాలని, అందరికి సంక్షేమ ఫలాలు అందాలంటే మరొక్కమారు బి.

ఆర్.ఎస్ పార్టీకే అధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేసి, ఐదేండ్ల పాటు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్నారు.

అనంతరం లక్ష్మీ నరసింహా రావు మాట్లాడుతూ ఎలాంటి లక్ష్యం, ఆశయం లేకుండా కేవలం ఆశతో ముందుకు వస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దని, ఒక్కసారి మోసపోతే ఐదేండ్లు గోసపడతామని అన్నారు.

ఎలాంటి గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని, మోసపూరిత వాగ్దానాలతో, అమలు కానీ హామీలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, గత 60ఏండ్లలో చేయని పనులు ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే వేములవాడ నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని, ఈనాడు సాగునీరు, త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదని, సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది బంగారు తెలంగాణగా మారుతుందని, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని, నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇస్తే మూడేండ్లలో వేములవాడ రూరల్ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.

అంతకుముందు గ్రామానికి చేరుకున్న చల్మెడ ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అక్కడి నుండి మహిళ సోదరీమణులు పూల వర్షం కురిపిస్తుండగా, డప్పు చప్పుళ్ళు, జై తెలంగాణ నినాదాల మధ్య స్థానిక నాయకులు,ప్రజాప్రతినిధులతో కలసి చల్మెడ పాదయాత్రగా వెళ్లి సమావేశ స్థలానికి చేరుకున్నారు.

బి.ఆర్.

ఎస్ పార్టీలో చేరికలు.వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ, బి.

ఎస్పీ, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, వృద్ధులు, సుమారు 150మంది బి.

ఆర్.ఎస్ పార్టీలో చేరారు.

పార్టీలో చేరిన వారికి జడ్పీ చైర్ పర్సన్ అరుణ, ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మీ నరసింహా రావులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, బి.

ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ తిరుపతి రెడ్డి, సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మాండ్లుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డ్ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అమెజాన్ ప్యాకేజీలో రాకాసి బల్లి.. షాకైన కొలంబియా మహిళ..