బలపడుతున్న కాంగ్రెస్ కూటమి ! ' కారు - సారు '  ఎటు వైపు ?

దేశవ్యాప్తంగా బిజెపి హవాకు తిరుగు ఉండదు అనే అంచనాలు అందరిలోనూ ఉన్నాయి.కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనం అయిందని,  ఇక భవిష్యత్తు లేదనే ప్రచారం విస్తృతంగానే సాగుతూ వచ్చింది.

 బిజెపి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయ కూటమని బలపరిచేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఆ ప్రయత్నాలు జరిగినా అవి విఫలమయ్యాయి.

ఆ తరువాత టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ బాధ్యతలు స్వీకరించారు.

మూడో ప్రత్యామ్నాయకుటమిని బలపరిచేందుకు ప్రయత్నాలు చేశారు.కానీ ఆ ప్రయత్నాలు సాగిస్తూనే కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

  అయితే ఇటీవల కాలంలో బిజెపిపై వ్యతిరేకత పెరిగినట్లుగా అనేక రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు స్పష్టం చేశాయి.

చాలాచోట్ల అనేక ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి.అవన్నీ ఇప్పుడు బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అదే సమయంలో కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడం,  ఈ మేరకు ఆయా పార్టీ అధినేతలు బహిరంగంగా కాంగ్రెస్ కూటమిలో చేరుతున్నట్లుగా ప్రకటనలు చేస్తూ ఉండడం,  అలాగే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశి వరకు యాత్ర చేపడుతూ కాంగ్రెస్ గ్రాఫ్ పెంచే ప్రయత్నాలు చేస్తూ.

బిజెపి కేంద్రంలో అనుసరిస్తున్న వైఖరిని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తప్పుపడుతూ వస్తూ ఉండడం తదితర అంశాల కారణంగా కాంగ్రెస్ కూటమి వైపు వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలు,  ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాయి.

  """/"/ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ కూటమి వైపు చూస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

అలాగే సీఎం నితీష్ కుమార్ కూడా కాంగ్రెస్ కూటమిలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.కొద్ది రోజుల క్రితమే కెసిఆర్ నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తాను స్థాపించబోయే జాతీయ పార్టీకి మద్దతు ప్రకటిస్తారని కెసిఆర్ భావిస్తూ ఉండగా,  నితీష్ కుమార్ మాత్రం బీహార్ లో కాంగ్రెస్ జెడియూ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇక హర్యానాలో విపక్ష పార్టీల బహిరంగ సభ జరుగుతున్న సమయంలోనే నితీష్ కుమార్ కాంగ్రెస్ కు మద్దతుగా ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

"""/"/ ప్రస్తుతం ఎన్డీఏ కూటమి నుంచి చాలా పార్టీలు బయటకు వెళ్ళిపోయాయి.కొన్ని పార్టీలు ఎన్డీఏలో చేరకపోయినా,  బిజెపికి అవసరాలు మేరకు మద్దతు ఇస్తూ వస్తున్నాయి.

కానీ ఎన్నికల సమయంలోనూ.ఆ తరువాత ఆ మద్దతు ఎంతవరకు ఉంటుందనేది స్పష్టత లేదు.

మరోవైపు చూస్తే కాంగ్రెస్ వైపు బలమైన ప్రాంతీయ పార్టీలు చూస్తూ ఉండడంతో,   కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న కెసిఆర్ ఇబ్బందుల్లో పడినట్లుగా అయింది.

   .