పుష్ప 2 షూట్ అప్డేట్.. మేజర్ పార్ట్ అంతా అక్కడేనట!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.

ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది.పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచు కున్నాడు.

అప్పటి వరకు కేవలం సౌత్ కే పరిమితం అయిన అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.

అంతలా పుష్పరాజ్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.

"""/"/ ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా షూట్ గురించి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంత వరకు స్టార్ట్ కాలేదు.ఇప్పుడు అప్పుడు అంటూ జులై నుండి చెబుతూనే ఉన్నారు.

కానీ ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసారు కానీ ఇంకా రెగ్యురల్ షూట్ మాత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు.

మరి త్వరలోనే రెగ్యురల్ షూట్ స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తుంది.ముందు అనుకున్న ప్రకారం హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి అప్పుడు కీలక సన్నివేశాల కోసం బ్యాంకాక్ వెళ్లనున్నట్టుగా తాజా టాక్.

అక్కడే రెండు నెలల పాటు షూటింగ్ జరుపుకోనుందట.అక్కడే ఎలాంటి బ్రేక్ లేకుండా బ్యాంకాక్ అడవుల్లో షూట్ జరగనుందని టాక్ వస్తుంది.

అలాగే ఆ తర్వాత మారేడుమిల్లి లో కూడా కీలక షెడ్యూల్ జరగనుందట.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఆ డైరెక్టర్ డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న రిషబ్ శెట్టి.. కోరిక తీరుతుందా?