2022 జూన్ 3వ తేదీన బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదలవుతున్న 'మైదాన్'

ప్రపంచం లో అత్యధిక గేమ్ లవర్స్ ఆదరించే ఆట ఫుట్ బాల్ (సాకర్).

ఈ ఆట నేపధ్యం లో యదార్ధగాద ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'మైదాన్'ప్రపంచ పటం లో ఫుట్ బాల్ ఆట రంగాన్ని భారత దేశానికి కూడా ఓ ప్రాముఖ్యత ఆపాదించిన ఓ కోచ్ నిజజీవిత కథతో ఈ చిత్రం తెరెకెక్కుతుంది.

జీవితం లో నైనా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తే గాని విజయం వరిస్తుంది.

క్రీడా నేపధ్యం లో స్ఫూర్తివంతమైన కథగా మైదాన్ నిర్మించబడింది.ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ గత ఏడాది రెండు సార్లు విడుదల తేదీ ని కూడా ప్రకటించారు .

అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆయా తేదీలలో విడుదల చేయలేదు.ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా ఈ చిత్రం 2022, జూన్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి పై పోరాటం చేస్తున్నాం.

ఎవరికి వారు ఇంటిపట్టునే వుండి తమ ప్రాణాలను సురక్షితంగా కాపాడుకున్నారు.అలాంటి పరిస్థితులలో థియేటర్లలన్నీ మూత పడ్డాయి.

మన భారత దేశం గర్వపడేలా రూపొందించిన మా మైదాన్ చిత్రం థియేటర్లలో చూస్తేనే థ్రిల్లగా ఉంటుందని, రెండుసార్లు ప్రకటించిన తేదీలలో విడుదల చేయలేకపోయాము.

వచ్చేఏడాది జూన్ 3వ తేదీన పక్క ప్రణాళిక తో విడుదల తేదీని ఖరారు చేసాము" అన్నారు.

బాదాయ్ హో వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రవీంద్ర నాథ్ శర్మ మాట్లాడుతూ గతం లో క్రీడా నేపధ్యం లో వచ్చిన ఎన్నో సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.

కబాడీ, క్రికెట్, బాక్సింగ్, రెస్లింగ్, రన్నింగ్ రేస్, వంటి గేమ్స్ నేపధ్యం లో ఎన్నో చిత్రాలు వచ్చాయి కానీ ఫుట్ బాల్ పై ఇండియన్ మూవీ ఇప్పటివరకు నిర్మించలేదు.

చిత్రం చూస్తున్నంతసేపు ఫుట్బాల్ స్టేడియం లో మనము వున్నట్లుగా ఆటగాడితో పాటు మనం ఉద్వేగానికి లోనయ్యేటట్లు ఫీల్ అయ్యి సన్నివేశాలు ఉంటాయి.

అందుకనే ఇన్నాళ్లు థియేటర్లో మాత్రమే రిలీజ్ చేయాలి అని ఎదురు చూసి విడుదల తేదీని ప్రకటించడం జరిగింది.

అన్నారు """/"/ అజయ్ దేవగణ్ తో పాటు నేషనల్ అవార్డు విన్నర్ ప్రియా మణి, బాదాయ్ హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్, నితన్ష్ గోయల్, తది తరులు నటిస్తున్న మైదాన్ చిత్రాన్ని ఫ్రెష్ లైం ఫిలిమ్స్ సహకారంతో జీ స్టూడియోస్ బ్యానర్ పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరుణవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్…