రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించి.. వాట్సప్ డీపీతో అడ్డంగా బుక్కైన పనిమనిషి..!

దొంగతనం ఎంత జాగ్రత్తగా చేసినా ఏదో ఓ చిన్న పొరపాటు తప్పకుండా చేస్తారు.

చిన్న క్లూ అయినా దొంగతనం జరిగిన ప్రదేశంలో వదిలి వెళ్తారు.లేదంటే దొంగతనం చేశాక ప్రవర్తనలో మార్పే దొంగను అడ్డంగా పట్టించేస్తుంది.

నమ్మకంగా పనిచేస్తూ దొంగతనం చేసి వాట్సప్ డీపీ( Whatsapp DP ) ద్వారా అడ్డంగా దొరికిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో( Bhopal ) ఓ ధనవంతుల కుటుంబంలో పనిమనిషి ( Maid ) నమ్మకంగా పనిచేస్తూ ఉండడంతో, కుటుంబ సభ్యులు ఆమెను పూర్తిగా నమ్మి పనిమనిషిలా కాకుండా కుటుంబ సభ్యురాలిగా చూసుకోవడంతో పాటు ఇంట్లోనే రహస్యాలు కూడా ఆమెతో చెప్పుకునేవారు.

అయితే ఆ కుటుంబం బయటికి వెళ్లిన సందర్భంలో ఆ పనిమనిషి కన్ను ఇంట్లో ఉండే బంగారు ఆభరణాలపై పడింది.

వెంటనే బీరువాలో ఉండే రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కాజేసింది.

కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే బీరువాలో ఆభరణాలు మాయం అయిన సంగతి తెలిసింది.

"""/" / పనిమనిషి పై నమ్మకం ఉండడంతో ఆమెను అనుమానించకుండా కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి, కుటుంబ సభ్యులతో పాటు పనిమనిషిని కూడా విచారించారు.

కానీ పనిమనిషి మీద నమ్మకం ఉండడంతో ఆమెపై ఎటువంటి అనుమానం అటు పోలీసులకు, ఇటు కుటుంబ సభ్యులకు కానీ కలుగలేదు.

ఇంట్లో ఆభరణాలు చోరీ అయ్యి నెలలు గడుస్తున్న దొంగతనానికి సంబంధించి చిన్న క్లూ కూడా లభించలేదు.

ఇక దొంగతనం గురించి అందరూ మర్చిపోయారని పనిమనిషి భావించింది.ఇక తన దొంగతనం ఎన్నటికీ బయటపడదు అని సంబరపడింది.

"""/" / దొంగలించిన ఆభరణాలలో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఫోటో దిగడమే కాక ఆ ఫోటోను వాట్సప్ డీపీ గా పెట్టుకుంది.

ఆ ఇంటి యజమాని మామూలుగా వాట్సాప్ డీపీలు చూస్తూఉండగా పనిమనిషి పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తన ఇయర్ రింగ్స్ లాగే ఉండడంతో కాస్త అనుమానం వచ్చింది.

ఇక పని మనిషి ప్రవర్తనను గమనిస్తే కాస్త తేడాగా ఉండడంతో వెంటనే ఆ ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చింది.

పోలీసులు ఆ పనిమనిషిపై నిఘా పెట్టి, పక్కా ఆధారాలు సేకరించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఆ పనిమనిషి నుండి బంగారు ఆభరణాలతో పాటు రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.

ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ .. ఏ ఏ అంశాలపై చర్చించారంటే ?