బీటెక్ అర్హతతో కోటి రూపాయల జీతంతో జాబ్ సాధించిన మహిపాల్ సేజు.. ఇతని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో ఏడాదికి కోటి రూపాయల వేతనం సాధించడం అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

అయితే మహిపాల్ సేజు( Mahipal Seju ) అనే బీటెక్ విద్యార్థి బీటెక్ అర్హతతో ఏకంగా కోటి రూపాయల జీతం అందుకుంటున్నారు.

పట్టుదల, అంకిత భావం, నైపుణ్యంతో మహిపాల్ సేజు తను కన్న కలను నెరవేర్చుకున్నారు.

ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలలో చదవకపోయినా మహిపాల్ సేజు లక్ష్యాన్ని సాధించడం ద్వారా వార్తల్లో నిలిచారు.

జపాన్ కంపెనీ ( Japanese Company )నుంచి కోటి రూపాయల వార్షిక వేతనం అందుకుంటున్న మహిపాల్ సేజు తన సక్సెస్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను ఐఐటీ, ఐఐఎం స్టూడెంట్ ను కాదని అందరిలానే బీటెక్ డిగ్రీ పూర్తి చేసి ఈ ఉద్యోగాన్ని సాధించానని వెల్లడించారు.

జోథ్ పూర్ లోని బార్మర్ ( Barmer In Jothpur )లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మహిపాల్ ఢిల్లీలో బీటెక్ పూర్తి చేశారు.

మొదట 30 లక్షల రూపాయల జీతంతో జాబ్ సాధించిన మహిపాల్ మూడేళ్ల అనుభవం తర్వాత కోటి రూపాయల జీతంతో ఉద్యోగం సాధించారు.

"""/" / మెకానికా కార్పొరేషన్ ( Mechanica Corporation )అనే కంపెనీలో మహిపాల్ సేజు ప్రస్తుతం ఐటీ కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు.

పెద్దపెద్ద చదువులు చదవకపోయినా ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ ఉంటే సక్సెస్ సాధించవచ్చని మహిపాల్ సేజు ప్రూవ్ చేశారు.

మహిపాల్ సేజు సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పవచ్చు.మహిపాల్ సేజు సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

"""/" / మహిపాల్ సేజు ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయిలో సక్సెస్ సాధించడం గమనార్హం.

ఈతరం విద్యార్థులు మహిపాల్ సేజును స్పూర్తిగా తీసుకుంటే కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

మహిపాల్ సేజు టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

చేసిన సినిమా ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత ఒప్పుకున్న సినిమాను క్యాన్సల్ చేసిన హీరోలు ..!