సరికొత్త ఎస్‌యూవీ నుంచి ఎగిసిపడ్డ మంటలు.. వీడియో వైరల్..
TeluguStop.com
సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్లు ఎండాకాలంలో మంటలు అంటుకుంటాయి.అధిక వేడి ఇతర కారణాల వల్ల అవి ఈ అగ్ని ప్రమాదాలకు( Fire Accidents ) గురవుతుంటాయి.
కానీ రీసెంట్‌గా వర్షాలు పడుతున్న వేళ గ్రేటర్ నోయిడా( Greater Noida ) రోడ్‌లో ఓ పెట్రోల్ వెహికల్ ఒక ఊహించని ప్రమాదానికి గురైంది.
గ్రేటర్ నోయిడాలోని గామా సెక్టార్ దగ్గర వెళ్తున్నప్పుడు, కొత్తగా కొన్న SUV కారుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
చూస్తుండగానే ఆ కారు మొత్తం మంటల్లో కాలిపోయి పనిరాని విధంగా మారింది. """/" /
అయితే అదృష్టవశాత్తు కారు డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.
వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చాడు.అగ్నిమాపక సిబ్బంది వచ్చి సుమారు 30 నిమిషాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.
కానీ కారు అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది.ఈ సంఘటనను వీడియోగా తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు.
అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. """/" /
అసలేమైందంటే, మనోజ్ అనే వ్యక్తి తన కొత్త మహీంద్రా XUV 700( Mahindra XUV 700 ) కారుతో గామా సెక్టార్ కామర్షియల్ బెల్ట్ వైపు వెళ్తున్నప్పుడు, సాయంత్రం 5:30 గంటల సమయంలో కారు బొన్నెట్ నుంచి పొగ రావడం గమనించాడు.
వెంటనే కారు నుంచి బయటకు దిగగా, కారు మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లు తెలిసింది.
కొద్ది సమయంలోనే కారు మొత్తం దగ్ధమైంది.అయితే, మనోజ్( Manoj ) అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు.
కారులో మంటలు అంటుకున్నాయని తెలిసి వెంటనే అగ్నిమాపక దళం నుంచి ఇద్దరు సిబ్బంది అక్కడికి వచ్చారు.
వారు సుమారు 30 నిమిషాలు ఎంతో కష్టపడి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.కానీ, మంటలు పూర్తిగా ఆరిపోయే లోపే కారు మొత్తం కాలిపోయింది.
ఈ షాకింగ్ ఫైర్ యాక్సిడెంట్ కి గల కారణమేంటో ఇంకా తెలియ రాలేదు.
పోలీసులు అదే నిజాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతో పాటు ఆమె కూడా ఎలిమినేట్ అవుతారా?