నేడు మహిళా గోస-బీజేపీ భరోసా నిరసన దీక్ష
TeluguStop.com
హైదరాబాద్ లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో మహిళా గోస -బీజేపీ భరోసా నిరసన దీక్షకు శ్రీకారం చుట్టారు.
పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.ఈ దీక్షను రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించనున్నారు.
కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు.
అదేవిధంగా మహిళపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసి మహిళలకు సాధికారిత కల్పించాలని కోరుతూ సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.
కాగా ఈ నిరసనకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ వెనక ఉన్న అసలైన హీరో ఎవరంటే..?