మహేష్ కోనేరు గుండెపోటు వెనుక ఇంత పెద్ద కథ.. రూ.80 కోట్ల అప్పు?

టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు ఇటీవల విశాఖపట్నంలో గుండెపోటుతో కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.

మహేష్ కోనేరు అకస్మాత్తుగా చనిపోవడంతో టాలీవుడ్ లో చాలామంది దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఇప్పుడిప్పుడే కెరీర్లో స్థిర పడుతున్న మహేష్ కోనేరు ఒక్కసారిగా మరణించడంతో ఆయన సన్నిహితులు షాక్ అయ్యారు.

మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్.ఎన్టీఆర్ తన స్నేహితుడు అకాల మరణంతో ఎమోషనల్ అయ్యాడు.

డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా మహేష్ కోనేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.

ఇక నిర్మాత మరణం వెనుక వేరే కథ ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈయన గుండెపోటు రావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మహేష్ కోనేరు తీసిన సినిమాలు అంతగా ఏవి అంతగా ప్రాఫిట్ తెచ్చినవి లేవు.

అంతేకాకుండా ఇతనికి ఇండస్ట్రీలో దాదాపుగా 80 కోట్ల మేర అప్పు ఉందని సమాచారం.

"""/"/ ఆ అప్పుల బాధతోనే మహేష్ ఒత్తిడికి లోనయ్ ఉంటారని దీనితో అతడికి గుండెపోటు వచ్చి ఉంటుందని అంతా అనుకుంటున్నారు.

ఇక మహేష్ అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది? ఇండస్ట్రీలోనే ఆయన చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నట్టు తెలుస్తున్నాయి.

ఇక ఇందులో నిజానిజాలు ఆయన కుటుంబ సభ్యులతో తెలియాలి మరి.మహేష్ కోనేరు నా నువ్వే,118, మిస్ ఇండియా, తిమ్మరుసు లాంటి సినిమాలను నిర్మించారు.

ఆ ఏరియాలో మహేష్ కంటే సిద్ధునే తోపా.. గుంటూరు కారం కలెక్షన్లను బ్రేక్ చేశాడుగా!