నా సినిమాలు అక్కడ రిలీజ్ చేయొద్దని చెబుతున్న మహేష్.. అసలేం జరిగిందంటే?

మామూలుగా అభిమానులు హీరో హీరోయిన్ల సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని రిలీజ్ డేట్ లో కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉండడం అన్నది కామన్.

కానీ టాలీవుడ్ లో మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులు మాత్రం మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

సినిమా మొదలు కోసం ఎదురుచూడడం ఏంటా అని అనుకుంటున్నారా, అవునండోయ్ మహేష్ బాబు రాజమౌళి( Mahesh Babu Rajamouli ) కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా పూజా కార్యక్రమాలు ఎప్పుడు మొదలు కానున్నాయి అన్న విషయంపై ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి పక్కన పెడితే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైతే చాలని అనుకుంటున్నారు అభిమానులు.

ఆ సంగతి పక్కన పెడితే.ఇప్పటి వరకు మూవీ గురించి అధికారంగా ఎలాంటి అప్ డేట్స్ రాకపోయినా కూడా మహేష్, జక్కన్న ఇద్దరు మూవీకి సంబంధించిన పనుల్లోనే బిజీగా ఉన్నారు.

ఈ టైంలో ఇప్పటి వరకు తనతో సినిమాలని నిర్మించిన నిర్మాతలందరిని మహేష్ ఒక కోరిక కోరుతున్నాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మహేష్, జక్కన్నల మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.జక్కన్న కూడా ఆర్ఆర్ఆర్ ని మించిన సక్సెస్ ని అందుకోవాలనే కసితో మూవీకి సంబంధించిన ప్రతి అంశంలోను జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

"""/" / ఆర్ఆర్ఆర్( RRR ) హిందీ చిత్ర సీమలో ఎంతగా విజయం సాధించిందో అందరకి తెలిసిన విషయమే.

పైగా అక్కడి ఆడియన్స్ కూడా జక్కన్న సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ కారణంతో కూడా జక్కన్న ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు.

ఇప్పుడు ఈ విషయం మీదనే మహేష్ తన నిర్మాతలకి ఒక విన్నపం చేస్తున్నాడు.

జక్కన్న సినిమాతోనే బాలీవుడ్ కి పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాడు.దీంతో తన గత చిత్రాల్లో వేటిని కూడా హిందీ లాంగ్వేజ్ లోకి డబ్ చెయ్యద్దని ఆయా చిత్ర నిర్మాతలని కోరుతున్నాడు.

బాలీవుడ్ ప్రేక్షకులు జక్కన్న మూవీ తోనే తనని రిసీవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.రాజమౌళి కూడా మహేష్ నిర్ణయానికి ఒకే అన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో చాలా తెలుగు సినిమాలు హిందీ లోకి డబ్ అవుతున్న విషయం తెలిసిందే.

కానీ తన సినిమాను మాత్రం డబ్ చేయొద్దని మహేష్ బాబు కోరుకుంటున్నారు.ఈ విషయం పట్ల నిర్మాతలు మహేష్ బాబుకి అనుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.

కంటి ఆరోగ్యానికి అండగా ఉండే ఈ ఆహారాలు మీరు తింటున్నారా..?