మహేష్, రామ్ చరణ్ బ్యూటిఫుల్ పిక్స్.. ఎక్కడ కలిసారో తెలుసా?

ఈ రోజు తెలుగు సినీ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా అక్కినేని కుటుంబం కూడా ఈ ప్రత్యేక దినాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

అక్కినేని కుటుంబానికి నాగేశ్వరరావు గారి వల్లనే ఇంత పేరు వచ్చింది.టాలీవుడ్ లోనే అగ్ర కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి .

"""/" / నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా ఈ రోజు అక్కినేని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.

ఇక అక్కినేని కుటుంబం మొత్తం కలిసి ఈ రోజున అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. """/" / మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ( Venkaiah Naidu )గారి చేతుల మీదుగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.

ఇక్కడ జరిగిన మూమెంట్స్ నెట్టింట వైరల్ కాగా అందులో ఫ్యాన్స్ ను కొన్ని పిక్స్ ఆకర్షిస్తున్నాయి.

మరి అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకకు వీరిద్దరూ కూడా హాజరయ్యారు.రామ్ చరణ్, మహేష్ బాబు( Mahesh Babu ) పాల్గొనగా ఇద్దరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటున్న పిక్స్ బయటకు వచ్చాయి.

ఈ పిక్స్ లో మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఉంది.ఈ ముగ్గురు ఈ పిక్స్ లో కనిపిస్తుండగా ఇప్పుడు నెట్టింట ఫ్యాన్స్ తెగ వైరల్ చేసేస్తున్నారు.

ఇక మహేష్, చరణ్ ఫ్యాన్స్ అయితే ఈ ఇద్దరి మూమెంట్స్ ను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

నాకెప్పుడూ చరణ్ సత్తా మీద డౌట్ లేదు.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు వైరల్!