2030 వరకు రాజమౌళి సినిమాతో మహేష్ బిజీ.. ఇలా చేయడం జక్కన్నకు న్యాయమేనా?

సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులలో హీరోలే పైచేయి సాధిస్తారు.హీరోలకు ఉన్న క్రేజ్ దర్శకులకు ఉండటం జరగదు.

అయితే రాజమౌళి( Rajamouli ) మాత్రం ఈ విషయంలో మినహాయింపు అనుకోవాలి.దర్శకధీరుడు రాజమౌళికి ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే 2030 వరకు రాజమౌళి సినిమాతో మహేష్( Mahesh Babu ) బిజీగా ఉండనున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుండటంతో ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఏకంగా ఐదేళ్ల సమయం కేటాయించాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ కు కెరీర్ పరంగా ఐదు సంవత్సరాలు ఎంత ముఖ్యమైన సమయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

"""/" / మహేష్ మూవీ విషయంలో ఇలా చేయడం న్యాయమేనా జక్కన్న అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి సినిమా( Baahubali ) రెండు భాగాలుగా తెరకెక్కడానికి ఐదేళ్లకు పైగా సమయం పట్టింది.

మహేష్ సినిమా విషయంలో సైతం జక్కన్న ఇదే విధంగా చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అక్కర్లేదని చెప్పవచ్చు.

"""/" / మహేష్ రాజమౌళి కాంబో మూవీ( Mahesh Rajamouli Combo Movie ) బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మహేష్ బాబుకు భవిష్యత్తు సినిమాలతో సైతం క్రేజ్ భారీగా పెరగడం పక్కా అని చెప్పవచ్చు.

మహేష్ బాబు ఫ్యాన్స్ ఆశలను ఈ సినిమా ఎంతమేర నెరవేరుస్తుందనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది.

హైదరాబాద్: స్లోగా వెళ్లమన్నందుకు బైకర్‌కు కోపం.. వృద్ధుడిపై అటాక్‌ చేయడంతో..?