సూపర్ స్టార్ మహేష్ కు జోడీగా ఇండోనేషియా బ్యూటీ.. ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ను మించిన అందగత్తె అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు( Mahesh Babu ) నటించిన గుంటూరు కారం మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

మరికొన్ని గంటల్లో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్( Guntur Kaaram Pre Release Event ) ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

గుంటూరు కారంతో మహేష్ మరో సక్సెస్ అందుకుంటాడని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.మరోవైపు మహేష్ బాబు త్వరలో రాజమౌళి( Rajamouli ) మూవీ షూటింగ్ తో బిజీ కానుండగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరికేసింది.

ఈ బ్యూటీ ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ను మించిన అందగత్తె అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ పేరు చెల్సియా ఇస్లాన్( Chelsea Islan ) కాగా మహేష్ చెల్సియా జోడీ బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/"/ 1500 కోట్ల రూపాయల ఖర్చుతో హాలీవుడ్ లెవెల్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని 2026లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజమౌళి మహేశ్ సినిమా విషయంలో ఆర్.ఆర్.

ఆర్( RRR ) ను ఫాలో అవుతున్నారని ఆర్.ఆర్.

ఆర్.ప్యాట్రన్ ప్రకారం ఒకేచోట ఎక్కువ సంఖ్యలో సెట్లు వేసి షూట్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

"""/"/ విదేశీ లొకేషన్లకు సంబంధించిన సీన్లను గ్రీన్ మ్యాట్ లో షూట్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రాజమౌళి ఐదేళ్ల సమయం కేటాయిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

జక్కన్నకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

మహేష్ జక్కన్న మూవీ ముహూర్తం ఫిక్స్.. ఆరోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే!