ఒక్కడు సెంటిమెంట్ ‘SSMB28’కు వర్కౌట్ అవుతుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ), త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas )కాంబోలో తాజాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''SSMB28''.

ఈ సినిమా నుండి సూపర్ స్టార్ కృష్ణ( Super Star Krishna ) గారి జయంతి రోజున అంటే మే 31న అదిరిపోయే అప్డేట్ ఉంటుంది అని చెప్పినప్పటి నుండి మహేష్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.

ఈ అప్డేట్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో పెరిగింది. """/" / మాస్ స్ట్రైక్ రాబోతుందంటూ ఇప్పటికే మేకర్స్ నుండి పలు పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.

అయితే ఈ పోస్టర్స్ చూసిన ఫ్యాన్స్ ఒక అంచనాకు వస్తున్నారు.ఎందుకంటే తాజాగా రిలీజ్ చేసిన ఒక పోస్టర్ లో మహేష్ బాబు కబడ్డీ ( Kabaddi )ఆటలో బరిలోకి దిగబోతున్నట్టు అనిపిస్తుంది.

మెడకు తలకట్టు కట్టుకుని మాస్ లుక్ లో క్లాస్ గా దర్శనం ఇస్తున్నాడు.

అయితే మహేష్ కబడ్డీ ప్లేయర్ గా 20 ఏళ్లకు ముందు ఒక్కడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

"""/" / గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మహేష్ కెరీర్ లోనే మలుపు తిప్పే సినిమాగా బ్లాక్ బస్టర్ అయ్యింది.

మరి ఇదే సెంటిమెంట్ తో మహేష్ ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత కబడ్డీ అంటూ బరిలోకి దిగుతున్నాడు.

అయితే ఈసారి మహేష్ రౌడీలను చితకబాదడం కోసం బరిలోకి దిగుతున్నాడు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ కబడ్డీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని ధీమాగా ఉన్నారు.

రేపటి వరకు వెయిట్ చేస్తే ఆ మాస్ సంభవం ఎలా ఉంటుందో తెలిసి పోతుంది.

చూడాలి త్రివిక్రమ్ మహేష్ ను ఎలా చూపిస్తాడో.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?