బైజూస్ తరహాలో మహేష్ కొత్త యాప్..!

సూపర్ స్టార్ మహేష్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

ఇప్పటికే సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ వస్తున్న మహేష్ ఓ పక్క మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెట్టాడు.

హైదరాబాద్ లో ఏ.ఎం.

బి మాల్ ఎంత ఫేమస్ అన్నది అందరికి తెలిసిందే.ఇక లేటెస్ట్ గా మహేష్ మరో సరికొత్త బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.

మహేష్ ఈ లెర్నింగ్ యాప్ బిజినెస్ లో అడుగుపెట్టాలని చూస్తున్నాడట.మహేష్ ఇప్పటికే బైజూస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.

అలాంటి ఎడ్యుకేషనల్ ఈ లెర్నింగ్ యాప్ ఒకటి సొంతంగా పెట్టాలని అనుకుంటున్నాడట.కరోనా వల్ల ఈ లెర్నింగ్ యాప్స్ కు బాగా డిమాండ్ పెరిగింది.

ప్రస్తుతం స్కూల్స్ తెరచుకున్నా సరే ఈ లెర్నింగ్ యాప్ లకు మంచి డిమాండ్ ఉంది.

ఫ్యూచర్ లో వీటి అవసరం ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.అందుకే మహేష్ ఈ లెర్నింగ్ బిజినెస్ చేయాలని చూస్తున్నాడట.

మహేష్ మొదలు పెడితే కచ్చితంగా  ఈ లెర్నింగ్ యాప్ కి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.

దీనికి సంబందించిన మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

డ్రై హెయిర్ ను రిపేర్ చేసే బెస్ట్ రెమెడీ మీకోసం!