ఆ తేదీని తలచుకుని ఇప్పటికీ బాధపడుతున్న మహేష్, ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఎందుకు చేశామంటూ?

ప్రతి స్టార్ హీరో తమ పుట్టినరోజును ఎంతో ముఖ్యమైన రోజుగా భావిస్తారు.పుట్టినరోజున సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇవ్వడానికి దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తారనే సంగతి తెలిసిందే.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) పుట్టినరోజు మే 20వ తేదీ అనే సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మూవీ( Narasimhudu Movie ) 2005 సంవత్సరం మే 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

తన పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోని నేపథ్యంలో తర్వాత రోజుల్లో తారక్ ఆ తేదీన సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపలేదు.

ఎన్టీఆర్ కు ఒక విధంగా పుట్టినరోజు లక్కీ డే అయితే సినిమాలకు సంబంధించి మాత్రం అన్ లక్కీ డే అని ఫ్యాన్స్ భావిస్తారు.

అయితే ఈ తేదీ మహేష్ బాబుకు కూడా అన్ లక్కీ డే కావడం గమనార్హం.

మహేష్( Mahesh ) నటించిన బ్రహ్మోత్సవం మూవీ( Brahmotsavam Movie ) ఇదే తేదీన విడుదలైంది.

"""/" / బ్రహ్మోత్సవం మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ డిజాస్టర్ అనే ప్రశ్నకు సంబంధించి మహేష్ ఫ్యాన్స్ కు, సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మహేష్ నటించిన అన్ని సినిమాలలో ఎక్కువగా నిరాశపరిచిన సినిమా ఇదే కావడం గమనార్హం.

ఎన్టీఆర్, మహేష్ బాబు కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు.ఎన్టీఆర్, మహేష్ బాబులకు సోషల్ మీడియాలో క్రేజ్ పెరుగుతోంది.

ఇతర భాషల్లో సైతం ఎన్టీఆర్, మహేష్ లకు క్రేజ్ పెరుగుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబు రెమ్యునరేషన్లు భారీ రేంజ్ లో ఉన్నాయని తెలుస్తోంది.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్, మహేష్ బాబు భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

మహేష్, తారక్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

పార్టీలో ఉన్న కారు నాది కాదు.. ఎమ్మెల్యే కాకాణి