రాజమౌళే కాదు.. లైన్ లో ముగ్గురు.. మహేష్ ఓటు ఎవరికి..?

సూపర్ స్టార్ మహేష్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో అదరగొడుతున్నాడు.సర్కారు వారి పాట రిలీజ్ అవకుండానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు మహేష్.

త్రివిక్రం, మహేష్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా భారీ అంచనాలతో ఈ సినిమా వస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది.

జక్కన్నతో పాటుగా మరో ముగ్గురు దర్శకులు మహేష్ తో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు.

త్రివిక్రం సినిమా తర్వాత రాజమౌళి సినిమానే అంటూ వార్తలు వస్తున్నా తనకు 2 నెలలు డేట్స్ ఇస్తే సినిమా చేసేస్తా అంటున్నాడట సరిలేరు నీకెవ్వరు డైరక్టర్ అనీల్ రావిపుడి.

ఆల్రెడీ హిట్ కాంబినేషన్ కాబట్టి సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి.ఇక మహేష్ తో తాను సినిమాకు రెడీ అంటున్నాడు వంశీ పైడిపల్లి.

మహర్షి తర్వాత అసలైతే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాల్సింది కాని కొన్ని కారణాల వల్ల కుదరలేదు.

ఫైనల్ గా దళపతి విజయ్ తో సినిమా తర్వాత వంశీ పైడిపల్లి మహేష్ తోనే సినిమా చేస్తాడని టాక్.

ఇక మహేష్ డైరక్టర్స్ లిస్ట్ లో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ కూడా ఉన్నారు.

వంశీ పైడిపల్లితో పాటుగా మహేష్ బర్త్ డే ట్విట్టర్ స్పేస్ లో పాల్గొన్న సందీప్ వంగ మహేష్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

సో రాజమౌళి మాత్రమే కాదు ఈ ముగ్గురు దర్శకులు కూడా మహేష్ తో సినిమాకు రెడీ అన్నట్టు తెలుస్తుంది.

అఖండ 2 తర్వాత నేనేంటో అందరికీ చూపిస్తా…. నన్ను చూసి నాకే పొగరు: బాలకృష్ణ