ఇండియాలో అడుగు పెట్టబోతున్న సూపర్ స్టార్.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

మిశ్రమ స్పందన తెచ్చుకున్న కూడా మహేష్ తన స్టామినా తో కలెక్షన్స్ మోత మోగించాడు.

ఇక ఇప్పుడు ఓటిటిలో కూడా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.

అయితే ఈ క్రమంలోనే మహేష్ సర్కారు సూపర్ హిట్ అందుకోగానే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ చెక్కేసాడు.

మహేష్ బాబు వీలు కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు అనే విషయం అందరికి తెలుసు.

ఈ క్రమంలోనే సర్కారు తర్వాత లాంగ్ వెకేషన్ కు భార్య, పిల్లలతో కలిసి వెళ్ళాడు.

అయితే మొత్తంగా కొన్నాళ్ల విరామం తర్వాత మహేష్ బాబు ఇండియాకు తిరిగి వస్తున్నాడు అనే విషయం తెలిసింది.

"""/" / మరొక రెండు రోజుల్లో సూపర్ స్టార్ ఇండియాకు రాబోతున్నాడట.ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు.

ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా గ్రాండ్ లాంచ్ చేసారు కానీ ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.

దీంతో మహేష్ వెకేషన్ పూర్తి అయితే ఈ సినిమా వెంటనే సెట్స్ మీదకు వెళుతుంది.

ఈ ఆనందంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. """/" / 11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

జులై నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం అందుతుంది.ఈ సినిమాను వచ్చే సంక్రాంతిని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.