ఆ సినిమా చూసి భయపడ్డానంటున్న మహేష్!

కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల నిత్యం షూటింగులతో బిజీగా ఉండే స్టార్ హీరోలు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే.

కొంతమంది స్టార్ హీరోలు పూర్తి సమయం ఫ్యామిలీకే కేటాయిస్తుండగా మరి కొంతమంది సినిమాలు చూస్తూ ఆ సినిమాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

హారర్ సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడే మహేష్ బాబు తాజాగా ఒక సినిమా గురించి తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఆ హారర్ సినిమా తనను చాలా భయపెట్టిందని చెబుతున్నారు.నెట్‌ఫ్లిక్స్‌లో 'ది సోషల్ డైలమా' అనే సినిమాను చూశానని ఆ సినిమా ఎంతో నచ్చడంతో పాటు భయాందోళనకు గురి చేసిందని చెప్పారు.

ఆ సినిమా చూసిన అనుభవాన్ని మహేష్ షేర్ చేసుకుంటూ తాను హారర్ జోనర్ కు పెద్ద అభిమానినని.

హారర్ జోనర్ లోనే ది సోషల్ మీడియా భయంకరమైన సినిమా అని మహేష్ బాబు పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా అని.ఆ సినిమా భయం ఇప్పటికీ తగ్గలేదని మహేష్ పేర్కొన్నారు.

గతంలో కూడా మహేష్ సినిమాలు చూసి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మహేష్ బాబు ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు సైతం యూట్యూబ్ లో ది సోషల్ మీడియా టీజర్, ట్రైలర్లను చూడటంతో పాటు నెట్ ఫ్లిక్స్ అకౌంట్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవాళ్లు సినిమాను చూసి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నారు.మహేష్ ఈ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నారని తెలుస్తోంది.

బీజేపీ బలహీనపడింది.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్